ఒక అబ్బాయి, ఇంకో అమ్మాయి ప్రేమ, మనిషి రంగు కారణంగా వచ్చే వివక్షలను ఎదుర్కొంటూ ఫలిస్తుందా.. విఫలమవుతుందా అనేదే కథ. ఈ సినిమా ట్రైలర్‌లోనే ఈ సినిమాకి హీరో ఒక బ్రాండ్ అయిపోయాడు. పబ్లిసిటీకి డబ్బులు బాగా ఖర్చుపెట్టకపోయినా కూడా వ్యూవర్స్ ట్రైలర్‌ని షేర్ చేసీ చేసీ సినిమాకి బాగా బజ్ క్రియేట్ అయింది. ఈ మధ్య కాలంలో ఇలాంటివి బాగా వర్కౌట్ అవుతున్నాయి. ఒక లో బడ్జెట్ సినిమా ట్రైలర్‌ను అందరూ షేర్ చేయడం.. దానికి హైప్ క్రియేట్ అవ్వడం అదంతా ట్రైలర్ బాగుంటేనే జరుగుతుంది. మరి ఇంత హైప్ క్రియేట్ అయితే ఆటోమాటిక్‌గా హేటర్స్ కూడా క్రియేట్ అవుతారు. కాని సినిమా విడుదల అయ్యాక దీనికి హేటర్స్ నంబర్ జీరో కి పడిపోయింది.
కథ : ఓ పల్లెటూరులో ఉన్న ఓ చిన్న కుటుంబంలో ఓ నాన్న కొడుకు ఉంటారు. కొడుకు జయకృష్ణ రోజూ తెల్లవార్లు అందరి ఇళ్లకెళ్లి పాలు పోసి ఆ తర్వాత కాలేజీ కి వెళ్తాడు. ఓ రోజు సీనియర్స్ ర్యాగింగ్ చేస్తారన్న భయంతో ఇంకో క్లాస్ బయట హీరో కిట్టు దాక్కుంటే.. క్లాస్‌లో హీరోయిన్ దీప్తి- అమ్మవారు గెటప్‌లో డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటుంది. అక్కడ్నుంచి వన్ సైడ్ లవ్ మొదలవుతుంది. మధ్యలో కాలేజ్‌లో చిన్న గొడవ జరిగి ఓ సీనియర్‌ని అందరి ముందు ప్రిన్సిపల్ ఇంసల్ట్ చేస్తాడు.
ఇదీ చదవండి :
మిస్ ఇండియా సినిమా రివ్యూ
పవన్ గొప్ప మానవతామూర్తి ఎందుకంటే?
వాడు ఒక మంచి పని చేసి హీరో అయిపోదామని- హీరోయిన్ తన ఫ్రెండ్స్ తో డ్యాన్స్ ప్రాక్టీస్‌కి డ్రస్ మార్చుకునేటప్పుడు కిట్టును లోపలికి తోసి.. అతనిమీద లేనిపోని అభాండాలు వేసి అందరి ముందు అతణ్ని కొట్టి అవమానిస్తాడు. జరిగిందంతా ప్రిన్సిపల్‌కి పర్సనల్‌గా దీప్తి, ఆమెఫ్రెండ్స్ చెప్తారు. కానీ కిట్టు కి అది నచ్చదు. తనపై జాలి చూపించి తనతో ఫ్రెండ్షిప్ చేస్తానంటే అతను ఒప్పుకోడు. అప్పుడే దీప్తి కూడా కిట్టు అంటే తనకిష్టమని చెప్తుంది. అప్పట్నుంచి మెదలైన లవ్ స్టోరీ ఎలా ఎండ్ అవుతుంది.. అది హ్యాపీగా ఉంటుందా లేదా ఏడిపిస్తుందా అనేది కథ. కొన్ని కొన్ని హ్యాపీ ఎండింగ్స్ కూడా ఏడిపిస్తాయి, అది వేరే విషయం.
నటీనటులు : ఈ సినిమాలో ఒక అద్భుతమైన హైలైట్ సుహాస్. సినిమాల్లో నాచురల్‌గా యాక్ట్ చేస్తే అస్సలు బాగోదు. సినిమాల్లో ఓవరాక్షన్ చేస్తేనే సెట్ అవుతుంది. కానీ నాని లాగా నాచురల్‌గా నటించి ప్రశంసలు అందుకునే వాళ్లు నాని తప్ప ఇంకెవ్వరు నాకైతే తెలీదు. కానీ ఈ సినిమా తర్వాత నాని కాకుండా ఇంకొకడు కూడా ఉన్నాడు.. వాడు ఇప్పుడిప్పుడే వచ్చాడు.. ఇకమీద వస్తుంటాడు అని అర్థమయింది. ఎందుకో హైప్ కొద్దిగా ఎక్కువే ఇచ్చినట్టు అనిపిస్తుంది కానీ పర్వాలేదు. హీరోయిన్ చాందినీ నటన పర్వాలేదు అనొచ్చు. సినిమాల్లో కాస్త కొత్త మోహంలా కనిపించినా అలవాటైన వాళ్లకంటే బాగానే చేసిందని చెప్పొచ్చు. ఒక కమెడియన్‌గా కెరీర్ మొదలుపెట్టి, హీరో అవ్వాలనే తపనతో కష్టపడి విఫలమై, ఇప్పుడు విలన్ పాత్రల్లోకి ఎంట్రీ ఇస్తున్న సునీల్ ఒక సైకో క్యారెక్టర్. ఇలాంటి రోల్స్ కి ఇప్పుడిప్పుడే పరిచయమవుతున్న సునీల్‌ది మాత్రం బ్యాడ్ యాక్టింగ్ అని చెప్పాలి. ℅ కంచెరపాళెం హీరో రాజు- కిట్టు గాడి నాన్న. కంచెరపాళెంలో మాత్రం అందిరినీ షాక్ చేసిన రాజు ఈ సినిమాలో పెద్దగా నటించలేదు. తక్కువ స్క్రీన్ టైమ్ ఉన్నా ఓ మోస్తరుగా పర్వాలేదులే అనిపించేలా ఉంది రాజు నటన. కిట్టు ఫ్రెండ్ వైవా షర్ష, దీప్తి ఫ్రెండ్ దివ్య శ్రీపాద, ఇద్దరూ మంచి సప్పోర్టింగ్ క్యారెక్టర్స్ అనే చెప్పాలి. హర్ష గురించి తెలిసిందే. కానీ దివ్య శ్రీపాద కూడా సపోర్టింగ్ రోల్‌లో బాగా ఇంప్రెస్ చేసింది.
సాంకేతిక విభాగాలు: ఒక చిన్న బడ్జెట్ సినిమాలో టెక్నికల్ డిపార్ట్‌మెంట్స్ నుంచి ఎక్కువ ఆశించకూడదు. ఎక్కువ ఆశించకపోయినా ఓ లెక్కన ఇది సరిపోతుందిలే అనేట్లు ఉన్నాయి. కోదాటి పవన్ కళ్యాణ్ ఎడిటింగ్ పర్వాలేదు. కొద్దిగా బేసిక్ లెవల్ అనిపించినా సర్దుకుపోవచ్చు. శాకమూరి వెంకట్ సినిమాటోగ్రఫీ కూడా పర్వాలేదు. డైలాగ్స్ అక్కడక్కడా కొద్దిగ సోది అనిపించినా ఓవరాల్‌గా చూస్తే అవన్నీ మర్చిపోతాం. ఈ సినిమాలో యాక్టర్స్ హైలైట్, స్టోరీ కూడా హైలైట్. కానీ కాలభైరవ మ్యూజిక్ ఉంది కదా… అది ఫైనల్ టచ్ అప్‌లాగా సినిమాకి, యాక్టర్స్‌కి బాగా సెట్ అయిన మ్యూజిక్. మ్యూజిక్ వచ్చినప్పుడల్లా సడన్‌గా సినిమాకి కనెక్ట్ అయిన ఫీలింగ్ వస్తుంది. కొద్దిగ ఆర్-ఆర్ ఎక్కువైనట్టు అనిపించింది కానీ సినిమాతో మనం ఎంత కనెక్ట్ అవుతామంటే ఈ చిన్న చిన్న మిస్టేక్స్‌ని అస్సలు పట్టించుకోం. చిన్న బడ్జెట్ సినిమాను… ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు ఉండని సినిమాను.. ఓటీటీ ప్లాట్‌ఫాంపై తెచ్చి.. అందరి మెప్పు పొందిన దర్శకుడు సందీప్ రాజ్‌ను ప్రత్యేకంగా అభినందించాలి. అతనికి వచ్చిన మంచి పేరుకు తగినంత కష్టం ఈ సినిమాలో అణువణువునా కనిపిస్తుంది.
ఒపినియన్ : ఆమ్లెట్‌కు కేవలం గుడ్డు కొట్టి పోసుకుంటే ఏం బాగుండదు. కాస్తంత ఉప్పు, చిటికెడు మిరియాల పొడి వేస్తే టేస్ట్ బాగానేఉంటుంది. ఇక్కడ ‘బాగానే ఉంటుంది’ అనే పాయింట్ కాదు చూడాల్సింది. అఫ్ కోర్స్ అందికీ ఉల్లిపాయలు, టమేటాలు, ఇలా ఒక్కొక్కరికీ ఒక్కొక్క ఐటెం మస్ట్ అనిపిస్తుంది. కానీ ఉప్పు లేనిదే అస్సలు టేస్ట్ ఉండదు. మరీ సాదాగా కాకుండా కాస్తంత మిరియాల పొడి యాడ్ చేస్తాం. ఈ సినిమాలో కథ గుడ్డైతే నటన ఉప్పులాంటిది. ఇక మిరియాలపొడి అంటే మ్యూజిక్. కానీ ఇంకా చాలా పదార్థాలు చిన్న చిన్న క్వాంటిటీస్ లో ఉన్నాయ్. అవే సపోర్టింగ్ యాక్టర్స్, ఎడిటింగ్, డైరెక్షన్, డైలాగ్స్… ఇలా చాలా ఉన్నాయి. ఇవన్నీ వేయడం వల్ల టేస్ట్ కాస్తంత ఎక్కువ బాగుంటుది కానీ చెడదు.
ఫీల్ : మంచి కాంట్రాస్ట్ ఉన్న ఫోటో
స్కోర్ : 3.5/5