అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరువేంకటాద్రీశుని దర్శనం అనేదే భక్తకోటికి మహా గొప్ప వరంగా భావించే తరుణంలో.. దానిని అడ్డుపెట్టుకుని పెట్రేగే దళారీలు నిత్యం పుట్టుకొస్తూనే ఉంటారు. తిరుమల దర్శనం పేరిట వేలకు వేలు కాజేసే దళారీలు అనేకులు నిత్యం వార్తల్లో కనిపిస్తుంటారు.
వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ఒకే దళారీ గతంలో పట్టుబడినా, అనేక కేసులు ఉన్నా కూడా.. మళ్లీ అదేదళారీ పనులతో మరోసారి పోలీసులకు చేజిక్కాడంటే.. ఏమనుకోవాలి? తిరుమలలో అసలేం జరుగుతోంది?
తాజాగా భక్తులను మోసగిస్తున్న ఒక దళారీపై విజిలెన్స్ అధికారులు- పోలీసులకు పిర్యాదు చేశారు. తోమాల సేవ టిక్కెట్లు ఇప్పిస్తానంటూ హైదరాబాద్‌కి చెందిన మధుసూధన్ వద్ద దళారి రమణ ప్రసాద్ 20 వేల రూపాయలు వసూలు చేసినట్లుగా ఫిర్యాదు నమోదు అయింది.
ఈ దళారీ రమణప్రసాద్ కొత్తగా ఈ అవతారం ఎత్తినవాడు కాదు. గతంలో కూడా భక్తులను మోసం చేసినట్లుగా రమణప్రసాద్‌పై వన్ టౌన్ పోలీసు స్టేషన్ లో కేసులు ఉన్నాయి.
ఆ కేసులకు సంబంధించి అతని మీద ఏం చర్యలు తీసుకున్నారో ఏమో తెలియదు గానీ.. తాజాగా మరోసారి భగవంతుడి పేరిట మోసాలతో పోలీసు కేసుల్లోకి రావడం గమనార్హం.
.

Discussion about this post