ఎన్నికలు వస్తే చాలు నాయకులు ఎడాపెడా మాటలు చెప్పేస్తుంటారు. వీటన్నింటినీ ప్రజలు నమ్మే రోజులు కూడా పోయాయి. కానీ.. నూటికి పది మంది అయినా.. నాయకులు చెబుతున్న మాటలను నమ్మే ప్రమాదం ఉంది. వారు నిజంగానే చెప్పినవన్నీ చేసేస్తారేమో.. ఈ సమాజం బాగుపడిపోతుందేమో అనుకునే అవకాశం కూడా ఉంది. అలాంటప్పుడు.. ఆ నాయకులు గద్దె ఎక్కగానే.. ప్లేటు ఫిరాయిస్తే ఎవరికి చెప్పుకోవాలి? వారిని ఎలా నిలదీయాలి? నిలదీయడానికి మనకు ఏమైనా హక్కు ఉంటుందా?
ఇలాంటి ఆలోచన నుంచే పుట్టినట్లుగా అనిపిస్తోంది.. లక్ష్మీనారాయణ చెబుతున్న బాండ్ల వ్యవహారం. ప్రజలే తమ సమస్యల గురించి.. ఒక నివేదిక తయారుచేసుకుని వాటిని పరిష్కరిస్తాం అనే మాట ఇచ్చేలా.. వాటి గురించి ప్రచారానికి వచ్చే నాయకులపై బాండ్ పేపర్ మీద సంతకాలు తీసుకోవాలని.. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పిలుపు ఇస్తున్నారు.
బాండ్ల మీద సంతకం అనగానే.. నాయకులే జడుసుకునే ప్రమాదం పుష్కలంగా ఉంది. ఈ ఆలోచన వర్కవుట్ అయ్యేది కాదు గానీ.. మొత్తానికి నాయకుల్లో జవాబుదారీతనం లేదు అనే అంశాన్ని తెలియజెప్పడానికి, జవాబుదారీతనం ఉండాలి అనే ఆత్మరక్షణ పరిస్థితిలో నాయకుల్ని పడేయడానికి మాత్రం ఉపయోగపడుతుంది. డబ్బిచ్చి ఓట్లను కొనుక్కోగలం.. గెలిస్తే ఆ డబ్బును తిరిగి సంపాదించుకోగలం.. అనే వైఖరితో నాయకులు చెలరేగుతున్నంత వరకు.. నేటి రాజకీయ వ్యవస్థలోని మలినాలు తొలగిపోవని ప్రజలు అనుకుంటున్నారు.
.

Discussion about this post