చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం కాపుగున్నేరి సమీపంలో గల స్కిమ్స్ బి-స్కూల్ లో సోమవారం నుంచి ఎంబీఏ, ఎంసీఏ తరగతులు ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా విద్యార్థులతో ఏర్పాటు చేసిన సమావవేశానికి కళాశాల కరస్పాండెంట్ మిద్దెల హరి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు కృషి, పట్టుదలతో చదివితే ఉన్నత స్థానాలకు చేరుకుంటారని చెప్పారు.
ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా చదివి.., వారికి, కళాశాలకు మంచి పేరు తేవాలని కోరుకున్నారు.
విద్యార్థులు మొదటి నుంచి ప్రణాళికా బద్దంగా చదివితే తాము అనుకున్న లక్ష్యం చేరవచ్చన్నారు. విద్యార్థులు క్రమం తప్పకుండా కళాశాలకు రావాలన్నారు.
క్రమశిక్షణతో మెలగాలని చెప్పారు. తమ కళాశాలలో మెరుగైన విద్యాబోధన ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల పూర్వ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.రఘురామిరెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ గీతాదేవి, డీఎడ్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీకుమార్, అధ్యాపకులు, ఎంసీఏ, ఎంబీఏ విద్యార్థులు పాల్గొన్నారు.
.