అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తిరు వేంకటగిరినాధునికి భాగంగా.. మంగళవారం పున్నమి గరుడసేవ అత్యంత వైభవోపేతంగా జరిగింది. శ్రీ వేంకటనాధుడు.. తనకు అత్యంత ప్రీతిపాత్రమైన గరుడుని పై అధిష్టించి.. భక్తులకు కనులపండువ చేస్తూ.. తిరుమాడ వీధుల్లో ఊరేగారు. లక్షలాదిగా హాజరైన భక్తకోటి.. గరుడునిపై ఊరేగుతున్న మలయప్పను దర్శించి తరించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు.
తిరుమలేశుని బ్రహ్మోత్సవాలలో జరిగే సమస్త వాహనసేవలలోనూ గరుడసేవ అత్యంత ప్రధానమైనదిగా అందరూ భావిస్తుండడం కద్దు. శ్రీమహావిష్ణువుకే గరుడుడు సాక్షాత్తూ వాహనం కావడమే ఆ విశిష్టత. పైగా బ్రహ్మోత్సవాల్లో నిత్యం ఊరేగే ఉత్సవమూర్తి మలయప్పకు.. ప్రత్యేకించి గరుడసేవ నాడు.. వేంకటేశ్వరుని మూలవిరాట్టుకు అలంకరించే.. సర్వాభరణాలను అలంకరించడం జరుగుతుంది. అదే గరుడసేవను మంగళవారం పౌర్ణమి సందర్భంగా పున్నమి గరుడసేవగా నిర్వహించారు.
తిరుమల శ్రీవారి దర్శనంలో క్షణకాలంలో ముగిసిపోయే శ్రీహరి దర్శన భాగ్యాన్ని అరుదుగా పొందే భక్తులు గరుడసేవ నాడు… ప్రత్యేకంగా.. మలయప్పకు అలంకరించే మూలవిరాట్టు ఆభరణాలు దర్శించడాన్ని మహద్భాగ్యంగా భావిస్తారు. అందుకే దేశవ్యాప్తంగానూ, విదేశాలనుంచి కూడా భక్తులు ప్రత్యేకంగా గరుడసేవకోసం తరలివస్తారు.
.
Discussion about this post