హోలీ రంగులు మానవ జీవితంలో చైతన్యం నింపుతుంది అని, సుగుణాలు నేరుపుతుందని ది స్కూల్ కరస్పాండెంట్ జనార్థన్ రావు జె పవార్ అన్నారు. శుక్రవారం ది స్కూల్ లో హోళీ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ హోళీ మన జీవితంలో రంగులు నింపాలని, ప్రతి విద్యార్ది తన జీవితాన్ని రంగుల మయం చేసుకోవాలన్నారు.
దీనికీ విద్యార్థులు ఇష్టంతో చదవాలని, కష్టంగా చదవకూడ దన్నారు.
అనంతరం కిండర్ గార్టెన్ విద్యార్థులు నాట్య ప్రదర్శనలు, రంగుల ఫై ప్రసంగాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ జనార్థన్ రావు జె.పవార్, ప్రధాన ఉపాద్యాయురాలు పి.విశాల, ఉపాద్యాయ బృందం పాల్గొన్నారు.
.