శాసన మండలి లో రెండు బిల్లులు సెలెక్ట్ కమిటీ కి వెళ్లడం ద్వారా జగన్ మైండ్ గేమ్ కు తెర తీశారని జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. మండలి ని రద్దు చేయాలని ఆలోచన ఉన్నట్లు, సోమవారం దీనిని సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని నేడు అసెంబ్లీలో ప్రకటించారు. దీంతో కొందరు తెదేపా సభ్యులు వైకాపా లో చేరుతారని అంటున్నారు.
పోతుల సునీత నేడు వైకాపా లో చేరడమే నిదర్శనం. కనీసం పది మంది ని లాగేస్తే మండలి లో తెదేపా కు మెజారిటీ ఉండదు. అప్పుడు సెలెక్ట్ కమిటీ వేసినా, కమిటీ లో తెదేపా వాదన నెగ్గదు. తద్వారా రెండు బిల్లులు ఆమోదం పొందడం ఖాయం.
వీలైనంత త్వరగా రాజధానిని మార్చుకుని పంతం నెగ్గించుకోవచ్చు. తదుపరి మండలి లోను ఎదురు ఉండదు. అందుకే మూడు రోజులు గడువు తో నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారని పరిశీలకులు భావిస్తున్నారు. అనుకున్నట్లు జరిగితే మండలి ఉంటుంది. లేకపోతే రద్దు చేయాలని చర్చించి, మరి కొన్ని రోజులకు వాయిదా వేస్తారు.
ఎందుకంటే రద్దు చేయాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపినా, కనీసం ఏడాది పెట్టవచ్చు. మరో ఏడాది ఆగితే సహజంగా నే మండలి లో వైకాపా కు మెజారిటీ వస్తుంది. దీనిని బట్టి మైండ్ గేమ్ తో మండలి లో తెదేపా ను చీల్చి వైకాపా మెజారిటీ ని పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.
అనుమతి ఇస్తే సగం మంది తెదేపా ఎమ్మెల్సీ లను లాగేస్తామని కొందరు మంత్రులు జగన్ తో అన్నారని ప్రచారం జరుగుతోంది. దీనిని బట్టి మండలి రద్దు కాదు…. తెదేపా ఎమ్మెల్సీ లను చీల్చుతారు… బిల్లులు విషయం లో భవిష్యత్తు లో ను ఇబ్బంది లేకుండా చేసుకుంటారు.. అని ప్రజలు అనుకుంటున్నారు.
.

Discussion about this post