• About Us
  • Contact Us
  • Our Team
Wednesday, August 26, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

లోపలి మాట : పెళ్ళి

పెళ్ళికి ముందు హాయిగా ఉన్న జీవితం, పెళ్ళయ్యాక నరకప్రాయంగా ఎందుకు మారుతోంది? లోపం ఎక్కడుంది?

admin by admin
June 28, 2021
0
లోపలి మాట : పెళ్ళి

పెళ్ళి అనేది ప్రతి మనిషి జీవితంలో మరచిపోలేని అపురూపమైన ఘట్టం. అది అసలైన జీవన పయనానికి ముఖద్వారం. కోటి ఆశల సమాహారానికి వేదిక. అందుకే యువతీ యువకులు పెళ్ళికోసం తహతహలాడుతూ ఎన్నో కలల కంటూ ఊహలలో తేలియాడుతూ ఉంటారు. తనకు కాబోయే భార్య/భర్త అందంగా ఉండాలని, మంచి ఆస్తిపాస్తులు కలిగిఉండాలని, తను చెప్పినట్లే నడచుకోవాలని, తనని బాగా చూసుకోవాలని ఎన్నో ఆశల సౌధాలను తమ మనోఫలకంలో నిర్మించుకుంటారు. తీరా పెళ్ళి అయ్యాక ఆ ఆశా సౌధాలన్నీ పేకమేడలా  కుప్పకూలిపోయినప్పుడు అసలు ‘పెళ్ళెందుకు చేసుకున్నామా?’ అని మధనపడుతూ మగ్గిపోతుంటారు.

పెళ్ళికి ముందు హాయిగా ఉన్న జీవితం, పెళ్ళయ్యాక నరకప్రాయంగా ఎందుకు మారుతోంది? లోపం ఎక్కడుంది?

deviprasad obbu columnistమన వివాహ వ్యవస్థలోనా? లేక మన ఆలోచనా విధానంలోనా? అంటే.. ఖచ్చితంగా మన ఆలోచనా విధానంలోనే లోపం ఉందంటాను నేను. ఎందుకంటే. తనకు నచ్చినట్లే ఉండాలని, తనకు అనుకూలమైనదే చేయాలని ఎవరికివారు భావించడంవల్లే భార్యాభర్తలలో మనస్పర్థలు ఏర్పడుతున్నాయి. అసలు ఒక వ్యక్తి తనకు నచ్చినట్లే ఉండాలనుకోవడం ఎంతవరకు సమంజసం. అది అవివేకం. అలా ఉండడం అసాధ్యం కూడా.

ఈ ప్రపంచంలో ఎవరూ ఇతరుల కోసం పుట్టరు. అంతేకాదు ఇతరుల ఆదర్శాలకు అనుగుణంగా నడుచుకుంటూ వాటిని నెరవేర్చేందుకు ఎవరూ ఇక్కడ సిద్ధంగా లేరు. ఎవరి ప్రేమకు వాళ్ళే యజమాని. కానీ, ఆ ప్రేమను ఇతరులకు ఎంత ఇవ్వాలకుంటే అంత ఇవ్వగలరు. అది వాళ్ళ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. ప్రేమను ఎవరూ దబాయించి పొందలేరు.

కానీ నేటి సమాజంలో  నూటికి తొంభై శాతం మంది ప్రేమను దబాయించి పొందాలనుకోవడం, వ్యక్తిగత విషయాలలో జోక్యం చేసుకోవడం, పరస్పర అవగాహనతో ఒకరినొకరు  గౌరవించుకోకపోవడం వంటి కారణాలచేత  భార్యాభర్తల మధ్య బంధాలు బీటలు వారుతున్నాయి.

వివాహితుల మధ్య ప్రేమ లేకపోవడం వల్ల కాదు.. స్నేహం లేకపోవడం వలనే అసంతృప్తితో జీవిస్తారు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య గొడవలు రావటానికి ప్రధానంగా రెండు కారణాలు మనకు కనిపిస్తున్నాయి.

  1. ‘తనకు నచ్చినట్లు ఉండడంలేద’ని భార్యాభర్తలు ఇద్దరూ ఎవరికివారు భావించడం వల్ల.
  2. అక్రమ సంబంధాలు.

ఉదాహరణకు:

తన భార్య ఎప్పుడూ సాంప్రదాయ బద్ధంగా చీరకట్టుకుని, తలలో నిండుగా మల్లెపూలు పెట్టుకుని, కంటికి కనబడేలా నుదిటిపై స్పష్టంగా బొట్టు పెట్టుకోవాలని ఒక భర్తకు ఆశ. కానీ, అతని భార్యకు అలా ఉండడం ఏమాత్రం ఇష్టం ఉండదు. అప్పుడు తనకు నచ్చినట్లు ఉండడంలేదని భర్త, నాకు నచ్చినట్లు నేనుంటానని భార్య ఎవరికివారు పంతాలకు పోవడం వల్ల వాళ్ళకు తెలియకుండానే ఇద్దరి మధ్య అగాధం ఏర్పడుతుంది. ఇది చూడటానికి చిన్న సమస్యగానే కనిపిస్తుంది. కానీ, నేటి యువతీయువకులు సర్దుకుపోదాం అనే ఆలోచన లేకుండా ‘అహం’తో జీవితాన్ని నరకప్రాయం చేసుకుంటున్నారు.

LSN Achar achar Artworks | Saatchi Artమరోక ఉదాహరణ:

తనకు తరచూ టీవీలలో సీరియల్స్ చూడడం, ఫోనులో స్నేహితులతో మాట్లాడడం ఒక భార్యకు ఇష్టం. కానీ, భర్తకు తన భార్య అలా ఉండడం నచ్చదు. తనకు అన్నం పెట్టేటప్పుడైనా కాస్త ఆప్యాయంగా పలకరిస్తూ వడ్డించకుండా ఫోనులో మాట్లాడుతూనో.., టీవీలో సీరియల్స్ చూస్తూనో.., తనను నిర్లక్ష్యం చేస్తుందని అతని ఆరోపణ. ఇది కూడా చిన్న సమస్యే. కానీ, ఇద్దరూ ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించాలనుకోరు. వాళ్ళ ధోరణి వాళ్ళదే. మరి బంధాలు బీటలు వారకుండా ఎలా ఉంటాయి?

ఇక రెండవది అక్రమ సంబంధాలు విషయానికొస్తే..

అసలు అమ్మాయిగాని, అబ్బాయిగాని ఒకసారి ఇష్టపడి పెళ్ళి చేసుకున్నాక మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకోవాల్సిన అవసరం ఏమి వస్తుందో అర్థంకాని విషయం. ఒకసారి పెళ్ళి చేసుకున్నాక ఎన్ని కష్టాలు ఎదురైనా పరిష్కరించుకోవాలేగాని పక్కదారుల వైపు మళ్ళకూడదు. అలా చేస్తే అసలు ఆ పెళ్ళికే అర్థంలేదు. కానీ, నేటి సమాజంలో కొందరు మేధావులు అక్రమ సంబంధాలను కూడా సమర్థిస్తున్నారు. మరీ విశ్లేషణలు చేసి తప్పేమీలేదని నిర్ధారించడం మన దౌర్భాగ్యం. పెళ్ళైన తర్వాత భర్తగాని, భార్యగాని తనకు ఇష్టమైన వ్యక్తితో సెక్స్ చేయడం తప్పుకాదని చేప్పే అతి మేధావులు ఉన్న ఈ సమాజంలో నిజాయితిని ఆశించడం మన అవివేకమే అవుతుంది. సమాజంలో ఎక్కడో అరుదుగా  జరిగే ఇలాంటి (అక్రమ సంబంధాలు) సంఘటనల గురించి మనం మాట్లాడుకోకపోవడమే మంచింది.

కానీ, మన సమస్య అంతా మొదటి పాయింట్ గురించే. మన భారతీయ వివాహ వ్యవస్థ ఎంతో బలమైనదని, శ్రేష్ఠమైనదని ప్రపంచమే శ్లాఘిస్తోంది.

మరి అలాంటి.. వివాహ వ్యవస్థ నేడు ఈ దీనావస్థకు చేరుకోవడానికి కారణం.. ఇప్పుడున్న సామాజిక పరిస్థితులేననేది సుస్పష్టం. మన ముందు తరాలవారు ఆచరించిన, అనుసరించిన విధానాలను మనం విస్మరించడంవల్లే మనకు ఈ దీనపరిస్థితి దాపురించింది.

మరి భార్యాభర్తల మధ్య బీటలు వారిన బంధాలను బలపరచుకోవాలంటే.. మనం ఏంచెయ్యాలి…?

* ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడానికి అసలైన కారణమేమిటో మొదట గుర్తించాలి.

* అది మళ్ళీ పునారావృత్తం కాకుండా ఉండేందుకు అహాన్ని విడిచి ఇద్దరూ ఒక దగ్గర కూర్చుని మనసు విప్పి మాట్లాడుకోవాలి

* ఒకరి అలవాట్లను, ఆలోచనలను మరొకరు పరస్పరం గౌరవించుకోవాలి.

*వ్యక్తిగత స్వేచ్ఛను భంగపరచుకోకుండా ఇద్దరూ అవగాహనతో మెలగాలి.

* ఇంట్లో వాళ్ళ కంటే బయటి వ్యక్తులతో గడిపితేనే ఎక్కువ ఆనందం ఉంటుందనే భ్రమను విడనాడి మన పిల్లలతో, జీవిత భాగస్వామితో అసలైన ఆనందం ఉంటుందనే వాస్తవాన్ని గ్రహించాలి.

*ఇద్దరి మధ్య దాపరికాలకు అవకాశం లేకుండా స్నేహితుల్లా ఒకరి విషయాలను మరొకరు పరస్పరం  పంచుకోవాలి.

* ఆర్థికపరమైన విషయాలలో ఇద్దరూ కలిసి ప్రణాళికలు వేసుకుని తదనుగుణంగా సంసారాన్ని సాఫీగా నడుపుకోవాలి.

* కష్ట సమయాల్లో అధైర్య పడకుండా ఇద్దరూ కలిసి సమస్యను సమర్థవంతంగా ఎదుర్కొనాలి.

* అన్నీంటికీ మించి.. ఒకరిపై మరోకరు ఇష్టాన్ని పెంచుకోవాలి.

ఈ విషయాలను భార్యాభర్తలు తుచాతప్పకుండా పాటించగలిగితే.. వాళ్ళ మధ్య ఏర్పడిన బీటలు తొలగిపోయి బంధాలు ఖచ్చితంగా బలపడుతాయి.

మరెందుకు ఆలస్యం.. అందరూ ఆ దిశగా పయనించి.. ప్రపంచ స్థాయిలో మన భారతీయ వివాహ వ్యవస్థకు ఉన్న గొప్పతనాన్ని, వైశిష్ట్యాన్ని అలాగే కీర్తి శిఖరాలపై  ఉంచి.. భావితరాల వారికి ఆదర్శంగా నిలుద్దాం.

…దేవీప్రసాద్ ఒబ్బు

9866251159.

Tags: deviprasaddeviprasad obbuhindu marriage systemlopali matamarriageobbu deviprasad
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

26.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన సామాజిక సంక్షోభాల సజీవ చిత్రణ

సురేష్ పిళ్లె: చదువులు వెలుగుతున్నాయా? తగలబడుతున్నాయా?

9.8.26 కథానిధి సమీక్ష: అక్షరాలే అసలైన కాపలాదారులు

2.8.26 కథానిధి సమీక్ష: సామాజిక వాస్తవికతకు అక్షర దర్పణం

9 ఆగస్టు 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

19.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన కల్లోల జీవిత చిత్రణ

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply