నగరి ఎమ్మెల్యే ఆర్ కే రోజా సెల్వమణి కి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు నగరి లోని ఆమె నివాసం వద్ద బుధవారం ఉదయం భూమన కలిశారు. పుష్పగుచ్ఛం సమర్పించి, దుశ్శాలువతో సత్కరించారు.
రోజా జన్మదినం సందర్భంగా ఆమె అభిమానులు నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆస్పత్రుల్లో రోగులకు పండ్ల పంపిణీ, అన్నదానం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
.