అధిక వర్షాల వలన నీటి నిల్వలు ఉండటం ఎక్కువైందని, అందులో దోమలు చేరి ప్రజలకు విష జ్వరాలు రాకుండా ముందుజాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మెడికల్ క్యాంపులు నిర్వహించాలని సిపిఐ నాయకులు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
వర్షాల వలన దెబ్బతిన్న రోడ్లను బాగు చేయాలని సిపిఐ పార్టీ నగరి నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్య, ఏఐటీయూసీ పట్టణ నాయకులు భాష డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా నగరి మున్సిపాలిటీ పరిధిలో అధిక వర్షాల వలన పల్లపు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండడం వలన అందులో దోమల చేరి దాని వలన ప్రజలు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని నాయకులు అధికార్లకు విజ్ఞప్తి చేశారు. ముందు జాగ్రత్తగా ఆ ప్రాంతాల్లో అంతా దోమల మందు కొట్టి బ్లీచింగ్ అంతా వేసి ప్రజలను కాపాడే మెడికల్ క్యాంపు నిర్వహించాలని కోరారు.
వర్షాలకు రోడ్లన్నీ దెబ్బతిన్నాయని ఇందిరమ్మ వార్డుకు వెళ్లే రోడ్డు, అదేవిధంగా బీమా నగర్, ఓరుగుంట పురానికి వెళ్లే రోడ్డులో మట్టి రోడ్లు అనేక రోడ్లు గుంతల మయం అయినాయి, కావున ప్రజలకు ఇబ్బంది లేని విధంగా రోడ్లు సమస్యను పరిష్కరించాలని కోరారు.
ఈ మేరకు నగరి మునిసిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజలు ఇబ్బంది పడుతున్న అన్ని చోట్ల దోమల నివారణకు స్ప్రే చేసి బ్లీచింగ్ వేయించి చర్యలు తీసుకుంటామని అన్నారు, పది రోజుల్లో రోడ్లు కూడా మరమ్మతులు పూర్తి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏ ఐ టి యు సి శేఖర్ ఉమాపతి తదితరులు పాల్గొన్నారు .
.