‘నోటా’ రివ్యూ

409

పాజిటివ్ హైప్ అనేది సినిమాను నిలబెట్టే పోకడ కాదు. మహా అయితే మంచి ఓపెనింగ్స్ మాత్రం రాబడుతుంది. కొన్ని సందర్భాల్లో ఆ ఓపెనింగ్స్ రెండోరోజుకే పూర్తిగా చతికిలబడవచ్చు కూడా. ఈ సిద్ధాంతాన్ని నిరూపించిన తాజా చిత్రం నోటా. వరుస సక్సెస్ లతో మంచి జోరు మీదున్న విజయ్ దేవరకొండ.. గీతగోవిందం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత చేసిన చిత్రం కావడంతో దీనికి ప్రారంభం నుంచి పాజిటివ్ బజ్ వచ్చింది. పైగా విజయ్ దేవరకొండ నుంచి ఎలాంటి ఎగ్రెసివ్ బిహేవియర్ ను రౌడీ ఫ్యాన్స్ ఆశిస్తారో అందుకు పుష్కలంగా చాన్స్ ఉన్న పొలిటికల్ సబ్జెక్ట్ కావడంతో హీట్ మరింత పెరిగింది.
కానీ, తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తూ.. విజయ్ దేవరకొండ సబ్జెక్ట్ ను ఎంచుకోవడం ఫెయిలయ్యాడని చిత్రం విడుదల తర్వాత తేలిపోయింది.
కథ లైన్ ఇంటరెస్టింగ్ గానే అనిపించినా.. ట్రీట్ మెంట్ విన్నతర్వాత.. ఇది ఆడే చిత్రం కాదని అర్థమైపోయి ఉండాలి. అలా అర్థంకాకపోయి ఉంటే గనుక.. జడ్జిమెంట్ లో హీరో ఫెయిలైనట్లు లెక్క. ఏదో ఇదివరకటి హిట్ సినిమాల సబ్జెక్టులు ఎంచుకోవడంలో అనుకోకుండా కాలం కలసి వచ్చిందేమో అనుకోవాలి. మొత్తానికి పొలిటికల్ సబ్జెక్ట్ తో విజయ్ గట్టి పరాజయాన్ని చవిచూశాడు. బహుశా ఈ పరాజయం అతనికి ఇకమీద జాగ్రత్తను నేర్పవచ్చు.
కథ లైన్ మంచిదే అయినా.. కథనం లో లోపాలు అడుగడుగునా ఉన్న చిత్రం ఇది. అలాగే.. సాంకేతిక విభాగాలే చిత్రాన్ని ప్రధానంగా పడగొట్టాయి. అందుల అగ్రస్థానం దర్శకత్వంది. అంతో ఇంతో సినిమాను నిలబెట్టడానికి ఉపయోగపడినదంతా.. విజయ్ ప్రతిభ మాత్రమే. ఆ ప్రతిభను అతను ఇంకాస్త జాగ్రత్తగా వాడుకుంటే.. మరిన్ని విజయాలు దక్కుతాయి.

Facebook Comments