దీపిక అందాలను మిస్సయిన పారిస్

240

కొన్ని అనేక అంతర్జాతీయ ఫ్యాషన్ ఈవెంట్స్‌ కు హాజరు అయిన దీపిక ఇప్పుడు ఒక పారిస్ ఫ్యాషన్ వారోత్సవాలకు వెళ్లదలచుకోలేదు. ఫ్రాన్స్ లో కొరోనా వైరస్ ఒక కొత్త దశలోకి ప్రవేశించింది అని తెలిసి లూయిస్ విట్టన్ ఫ్యాషన్ షో కు వెళ్లకూడదని నిశ్చయించుకుంది. బాలీవుడ్ నుండి ఒక లూయిస్ విట్టన్ షోకి ఆహ్వానం వచ్చిన మొదటి నటి దీపిక. అంతేకాదు, తను ఈ సంవత్సరం ఒక లగ్జరీ ఫ్యాషన్ హౌస్ ప్రచారంలో కూడా అంతర్జాతీయ ప్రముఖ నటులతో పాల్గొనింది.
చివరి సారిగా దీపిక- ‘ఛపాక్’ అనే ఆసిడ్ దాడి గురించిన సినిమాలో కనిపించింది. ఈ మధ్యే దీపిక ‘ది ఇన్టర్న్’ అనే సినిమా హిందీ రీమేక్‌కి ఒప్పుకుంది. తరువాత, దీపిక ‘83’ అనే సినిమాలో భర్త రణ్‌వీర్ సింగ్‌తో నటించబోతోంది.
దాదాపు 166 ఏళ్ల నుంచి నడుస్తున్న లూయిస్ విట్టన్ బ్రాండ్ చాలా ప్రసిద్ధమైనదని అందరికీ తెలిసిందే. దీపిక బాలీవుడ్‌లోని అగ్ర కథానాయికలలో ఒక నటి. పీకు, రామ్ లీలా, యే జవానీ హై దీవానీ లాంటి చాలా సినిమాలతో అభిమానులను మైమరపించిన దీపిక ఫ్యాషన్ ప్రేమికులను కూడా మైమరపించడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ, ఇలా తను ఒక ఫ్యాషన్ వీక్ ను మిస్ అవ్వడం, చాలా మంది తన అందాన్ని మిస్ అవ్వడం నిజంగా గమనార్హం.
ఇప్పటి వరకు కాన్నెస్ ఫ్యాషన్ వీక్ మరియు ఇతర ఫ్యాషన్ వీక్‌లలో దీపిక ఎంత అందంగా కనిపించి అందంతో అందరినీ మైమరపించిందో మనందరికీ తెలిసిందే. కానీ, ఈసారి మాత్రం కొరోనా వైరస్ అనే ఒక మహమ్మారీ వల్ల దీపిక అందాల్ని, పారిస్ మిస్ అవ్వాల్సి వస్తోంది… పాపం పారిస్…!

Facebook Comments