సంక్రాంతి పర్వదినాన పేదలకు కానుకలు అందించాల్సిన ప్రభుత్వం..ఓటీఎస్ పేరిట దందా చేయడం జగన్ రెడ్డికే చెల్లిందని తెలుగుదేశం తిరుపతి పార్లమెంటు జిల్లా కార్యదర్శి సముద్రాల సుధాకర్ నాయుడు ఎద్దేవా చేశారు.
సోమవారం నుంచి సచివాలయ సిబ్బంది మరియు వెలుగు సంఘమిత్రలు గ్రామాలలో నిరుపేదలను పది వేల రూపాయలను కట్టాలని హింసపెట్టడం దారుణమన్నారు.
ముఖ్యంగా జిల్లా హౌసింగ్ సంయుక్త కలెక్టర్ ఒత్తిడితో డ్వాక్రా మహిళల నుంచి రుణాల పేరిట గ్రూపుల నుంచి తీసుకుని జమ చేసుకుంటున్నారని సంఘసభ్యులు వాపోతున్నారు. పది వేలు కట్టకపోతే రేషన్ కార్డు తీసివేస్తామని, పింఛను నిలిపివేస్తామని సిబ్బంది బెదిరింపులకు దిగుతుండటం న్యాయమా అని ప్రశ్నించారు.
నవరత్నాల పేరిట రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తాజాగా వసూళ్లకు పేరిట పేదలను రుణగ్రస్తులుగా మార్చుతున్నారని ధ్వజమెత్తారు. బ్యాంకులలో అప్పుల కోసం ప్రభుత్వ ఆస్తులను తాకట్టుపెట్టగా.. డ్వాక్రా సభ్యులకు రుణాల కోసం సంఘాలను తాకట్టు పడుతున్నారని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గత ప్రభుత్వం సంక్రాంతి సమయంలో సంచితో సరుకులను కానుకగా ఇవ్వగా…ప్రస్తుత ప్రభుత్వం సంక్రాంతి రోజుల్లో ఓటీఎస్ పేరుతో అప్పును అందిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అధికారులు కూడా ప్రభుత్వ అనాలోచిత పనులకు మోకాలడ్డడం మానేసి పండగ పూట పేదలను హింసించడం మానుకోవాలని హితవుపలికారు.
Discussion about this post