తిరుపతి జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో సగటు పోలింగ్ 78.63శాతం నమోదైంది. పోలింగ్ పూర్తి వివరాలను మంగళవారం జిల్లా ఎన్నికల అధికారులు విడుదల చేశారు. అధికారుల సమాచారం మేరకు గూడూరులో 78.89శాతం, సూళ్లూరుపేటలో 82.92 వెంకటగిరిలో 80.87, చంద్రగిరిలో 79.89, తిరుపతిలో 63.32, శ్రీకాళహస్తిలో 83.25, సత్యవేడులో 85.28శాతం వంతున పోలింగ్ నమోదైంది.
జిల్లాలో 18,12,980మంది ఓటర్లు ఉండగా 14,25,540మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో పురుషులు 6,99,687మంది, మహిళలు 7,25,790 మంది, ఇతరులు 63మంది ఉన్నారు. నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే…
గూడూరులో పురుషులు 95,535 మంది, మహిళలు 97,880 మంది, ఇతరులు 15మంది… మొత్తం 1,93,430 మంది… సూళ్లూరుపేటలో పురుషులు 99,372మంది, మహిళలు 1,01,801మంది, ఇతరులు ఆరు మంది… మొత్తం 2,01,179మంది… వెంకటగిరిలో పురుషులు 97,799మంది, మహిళలు 99,184మంది, ఇతరులు ముగ్గురు… మొత్తం 1,96,986మంది…
చంద్రగిరిలో పురుషులు 1,22,161మంది, మహిళలు 1,29,597మంది, ఇతరులు 30మంది… మొత్తం 2,54,788మంది… తిరుపతిలో పురషులు 93,994మంది, మహిళలు 97,559మంది, ఇతరులు నలుగురు… మొత్తం 1,91,557మంది… శ్రీకాళహస్తిలో పురుషులు 1,00,982మంది, మహిళలు 1,05,930మంది, ఇతరులు ఇద్దరు… మొత్తం 2,06,914మంది, సత్యవేడులో పురుషులు 89,844మంది, మహిళలు 93,839మంది, ఇతరులు ముగ్గురు… మొత్తం 1,83,686 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Discussion about this post