క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి పేరే తెచ్చుకున్నాడు పృథ్విరాజ్. గత 40 ఏళ్లుగా ఇండస్ట్రీ లోనే ఉన్న పృధ్విరాజ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. ‘పెళ్లి’, ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘గగనం’, ‘చెన్నకేశవ రెడ్డి’ సినిమాలలో మంచి పాత్రల్లో కనిపించాడు పృథ్వి. ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో పృధ్విరాజ్ ఒక షాకింగ్ విషయాన్ని తెలియజేశాడు. పృధ్విరాజ్ ఇప్పటికీ 18 సార్లు ఆత్మహత్య యత్నం చేశాడట. అతనికి అమీర్ పేట్ లో ఒక సొంత ఫ్లాట్ ఉండేదట. ఆ అపార్ట్ మెంట్ లోని 14 అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుందామని కూడా ఒకసారి అనుకున్నాడట పృథ్వి.
కానీ తన అసిస్టెంట్ తో మాట్లాడిన తరువాత మనసు మార్చుకున్నానని తెలిపాడు. ఆ తరువాత ఆత్మహత్యల మీద షార్ట్ ఫిలిమ్స్ కూడా తీశాడు. అవి సోషల్ మీడియాలో బాగానే హల్ చల్ చేశాయి. పెద్ద హిట్ కూడా అయ్యాయి. ఇక సినిమాల గురించి మాట్లాడుతూ తనకు సీనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమని ఆయన కు పెద్ద ఫ్యాన్ ని అని చెప్పాడు. అంతే కాక ఎన్టీఆర్ జీవిత చరిత్ర లో తెరకెక్కుతున్న మొదటి పార్ట్ అనగా ‘కథా నాయకుడు’ సినిమాలో ఒక మంచి పాత్ర పోషించానని చెప్పాడు.
.