క్రీడాకారుల్లో క్రీడా నైపుణ్యం పెరిగేలా చూడాలని చిత్తూరు జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కోరారు. మంగళవారం సత్యవేడు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో ఏపీ సీఎం కప్ నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మాట్లాడుతూ చదువుతోపాటు విద్యార్థులకు క్రీడలు అవసరమన్నారు. దీన్ని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా తేడా పోటీలను మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో నిర్వహిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. క్రీడా రంగం అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అయితే అందుకు తగ్గట్టు క్రీడాకారుల్లో నైపుణ్యం పెంచడానికి వ్యాయామ అధికారులు కృషి చేయాలన్నారు.
విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం నాడు-నేడు పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఇప్పటికే మొదటి విడత నాడు-నేడు పథకంలో కొన్ని ప్రభుత్వ బడుల భవనాలను ఆధునీకరించడంతో పాటు విద్యార్థులకు అవసరమైన వసతులు కూడా కల్పించడం జరిగిందన్నారు. అన్ని బడులలో నాడు నేడు పథకం అమలు జరిగితే పాఠశాలలో దేవాలయాలుగా మారుతుందన్నారు.
ఎంపీపీ ప్రతిమ సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నైపుణ్యం పెంచుకోవడం వల్ల క్రీడారంగంలో క్రీడాకారులు రాణిస్తారు అన్నారు. శారీరక దృఢత్వానికి, ఆరోగ్యకర జీవనానికి క్రీడలు తప్పనిసరి జెడ్పిటిసి విజయలక్ష్మి చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు.కోటి రూపాయల వ్యయంతో పిచ్చాటూరు ఆర్నియర్ ప్రాజెక్టు ఆధునీకరణ పనుల్లో భాగంగా పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దడం, కైలాస్ కోన అభివృద్ధి పనులకు కృషి చేస్తున్న ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకుడు రఘుపతి రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
ఇదే తరహాలో ఉబ్బలమడుగు ప్రాజెక్టు పనులు కూడా చేపట్టి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ఆయన కోరారు.మండల విద్యాశాఖ అధికారి రవి ఆధ్వర్యంలో తొలిరోజు వాలీబాల్,కబడ్డీ,కోకో,షటిల్ బ్యాడ్మింటన్,హ్యాండ్ బాల్ వంటి క్రీడా పోటీలు ఆయా వ్యాయామ అధికారుల పర్యవేక్షణలో నిర్వహించారు. నియోజవర్గ స్థాయి క్రీడా పోటీలలో ప్రతిభ కనపరిచే క్రీడాకారులను జిల్లా స్థాయిలో జరిగే క్రీడా పోటీలకు పంపుతారు.
అంతకుమునుపు నూతన ఆంగ్ల సంవత్సరం పురస్కరించుకొని మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, ఎం పి పి ప్రతిమ జడ్పిటిసి విజయలక్ష్మి తదితరులకు పూలమాలవేసి ఘనంగా సత్కరించారు.తదనంతరం ఎమ్మెల్యే ఆదిమూలం క్రీడా పోటీలను ప్రారంభించారు.
Discussion about this post