విద్యార్థులలో దాగి ఉన్న సామర్ధ్యాన్ని వెలికితీయడానికి సైన్సు ప్రదర్శనలు నిర్వహిస్తున్నామని ద స్కూల్ కరెస్పాండంట్ జనార్దన్ రావు జె . పవర్ అన్నారు .
సోమవారం జాతీయ సైన్స్ దినోత్సవ సందర్భంగా పట్టణంలోని ద స్కూల్ లో విద్యార్థులు వివిధ రకాల సైన్సు ప్రదర్శనలు కార్యక్రమాన్ని ప్రారంభించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైన్స్ దినోత్సవాన్ని ప్రతి ఏడాది ఫిబ్రవరి 28 న జరుపుకుంటున్నామని వివరించారు .
ఇలా ఆనవాయితీగా 1987 నుండి నిర్వహించడం జరుగుతోందన్నారు . ఇందుకు కారణం 1928 లో సర్ సి వి . రామన్ ఎఫెక్ట్ ఆవిష్కరించడం కారణం అన్నారు . ఇందుకు గాను సి వి . రామన్ కు 1930లో ఆసియా ఖండంలోనే మొదటి నోబెల్ బహుమతి ఆయనకు వరించింది .
ఇలా మొదటి నోబెల్ బహుమతి తీసుకున్న సర్ సి. వి. రామన్ . సైన్సు దినోత్సవాన్ని నిర్వహించడం వలన విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించడం జరుగుతుందన్నారు .
ఇలాంటి సైన్స్ ప్రదర్శనలు విద్యార్థుల్లో ఉన్న మేధా శక్తిని వెలికి తీయడానికి ఎంతో ఉపయోగపడుతాయని వివరించారు . అనంతరం విద్యార్థులు రూపొందించిన సైన్స్ ప్రదర్శనలు చూసి వారిని అభినందించారు. ప్రిన్సిపల్ పి . విశాల మాట్లాడుతూ ఈ సైన్సు ప్రదర్శనలు నేటి సమాజంలో విద్యార్థులకు ఎంతో ఉపయోగపడతాయన్నారు . రామన్ ఎఫెక్ట్ వల్ల ఒక పదార్థంలో ఉన్న అణువుల కంపనాల గురించి సమాచారం చెబుతుంది కనుక రామన్ ప్రభావం ఉపయోగించి ఆ పదార్థంలో ఉన్న అణువుల నిర్మాణ శిల్పం తెలుసుకోవచ్చు. కనుక రామన్ ఎఫెక్ట్ ద్వారా రసాయనిక పదార్థాలలో అణు, బణు నిర్మాణాల పరిశీలన చెయ్యడం సుసాధ్యం అయింది..
కార్యక్రమంలో పి . వి . ఆర్ . గ్రూప్ డైరెక్టర్స్ పరమేశ్వరరావు వి . పవార్ , రాజారాం వి.పవార్, ప్రధానోపాధ్యాయురాలు విశాల , సైన్స్ ఉపాధ్యాయులు ఏ. బాగ్యలక్షి , మునికుమార్ , కె .ఇందుమతి , కె . స్వాతి పలువురు ఉపాధ్యాయులు , విద్యార్థులు , తల్లిదండ్రులు పాల్గొన్నారు .
.