నవంబరు 17, 18 వ తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో ఈ రెండు రోజులు తిరుమలకు వెళ్ళే రెండు నడక దారులు (అలిపిరి, శ్రీవారి మెట్టు) తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు టీటీడీ అధికారులు ప్రకటించారు.
భక్తుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. తిరుమలకు వెళ్ళే భక్తులు ఈ విషయం గుర్తించి, ఘాట్ రోడ్ ప్రయాణమే సురక్షితమని అధికారులు సూచించారు.
భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో తిరుమల ప్రయాణాలను భక్తులు రెండు మూడురోజులు వాయిదా వేసుకుంటేనే మెరుగ్గా కనిపిస్తోంది. నడకదారులను టీటీడీ అధికారికంగా మూసివేస్తుండగా, మొదటి ఘాట్ రోడ్డు కూడా ప్రమాదకరంగానే ఉంది. రాత్రివేళల్లో వాహన రాకపోకల్ని కూడా నిషేధించే అవకాశం ఉంది.
.