కాళ్లపారాణి ఆరక ముందే.. పెళ్లయిన మూడు నెలలకే ఓ నవవధువు ఆత్మహత్య చేసుకుంది. కుటుంబంతో గొడవపడిన అమ్మాయి తన జీవితాన్ని కడతేర్చుకుంది.
నవ వివాహిత ఆత్మ హత్య చేసుకున్న దుర్ఘటన తిరుపతి నగరంలోని ఎస్ కె డి నగర్ లో చోటు చేసుకుంది. మృతి చెందిన వివాహిత పుంగనూరు కు చెందిన సౌందర్య(22) గా పోలీసులు గుర్తించారు.
సౌందర్యకు 3 నెలల క్రితం వివాహం అయింది. పెళ్లి తర్వాత కుటుంబాలతో గొడవపడి ఈ నెల 8న తిరుపతికి వచ్చింది. ఆ వివాహితను ఓ కుటుంబం చేరదీసి ఆశ్రయం ఇచ్చారు.
ఆశ్రయం కల్పించిన ఇంటిలోనే సౌందర్య ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు.
తిరుపతి ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
.