తిరుమల తిరుపతి దేవస్థానాల పరిధిలో గోవుకు ఎక్కడా లేనంత అనల్ప ప్రాధాన్యం దక్కబోతోంది. ప్రత్యేకించి ఓ గోమందిరం ఏర్పాటు అవుతోంది. దీనితో పాటు టీటీడీ పరిధిలోని ఆయాలు అన్నింటిలోనూ తాజాగా గోపూజను కూడా అధికారులు ప్రారంభించారు.
అక్టొబరు నెలలో జరగనున్న తిరుమలేశుని వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతులమీదుగా గోమందిరం ప్రారంభించనున్నట్లు టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి ప్రకటించారు.
తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్ద శేఖర్‌రెడ్డి ఇచ్చిన రూ.15 కోట్ల విరాళంతో గోమందిరాన్ని నిర్మించారు. తిరుపతిలోని గోమందిరం, పీడియాట్రిక్ కార్డియాక్ ఆసుపత్రి, డిపిడబ్ల్యు స్టోర్స్‌లో పంచగవ్య ఉత్పత్తుల తయారీ కేంద్రం ఏర్పాటు కాబోతున్నాయి.
గోమందిరంలో గోప్రదక్షిణ, గోతులాభారం, గోవు ప్రాశస్త్యాన్ని భక్తులకు తెలియజేసేలా ఏర్పాట్లు ఉంటాయి. బర్డ్ ఆసుపత్రి ఆవరణంలో పీడియాట్రిక్ కార్డియాక్ ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించిన సివిల్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయ. త్వరలోనే ఇక్కడ వైద్య సేవలు కూడా ప్రారంభం అవుతాయి.
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లోనే ఆసుపత్రిని ప్రారంభించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. పంచగవ్య ఉత్పత్తుల తయారీకి తిరుపతిలోని డిపిడబ్ల్యు స్టోర్స్‌లో ఇంజినీరింగ్ అధికారులు ఏర్పాట్ల చేస్తున్నారు.
టీటీడీ ఆలయాల్లో లాంఛనంగా ప్రారంభమైన గోపూజ
తిరుచానూరు శ్రీ పద్మావతి దేవి ఆలయం, శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం, తిరుపతి లోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయం, కపిలతీర్థం శ్రీ కపిలేశ్వరస్వామి ఆలయాల్లో టీటీడీ గో పూజను లాంఛనంగా ప్రారంభించింది. ప్రతి ఆలయంలో భక్తులకు గోపూజ అందుబాటులోకి వచ్చేలా ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించిన విషయం విదితమే. గో సంరక్షణ శాల నుంచి ఆయా ఆలయాలకు గోవులు, దూడలను అందజేసి గోపూజ కార్యక్రమం ప్రారంభించారు.
ఇది కూడా చదవండి
ఇవి లేకుంటే తిరుమల సర్వదర్శనం కుదరదంతే..
.

Discussion about this post