చారిత్రక, ఆచార వ్యవహరాలలో ప్రాముఖ్యత ఆధారంగా, తిరుమలక్షేత్రం ప్రాశస్త్యాన్ని అనుసరించి ‘స్థల వృక్షం’గా సంపంగి -మాగ్నోలియా చంపకను టిటిడి గుర్తించింది.
ఇటీవలి కాలంలో ఈవో డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి ఆదేశాల మేరకు తిరుమలలో సంప్రదాయ ఉద్యానవనాలను టిటిడి అభివృద్ధి చేసింది. ఇందులో తిరుమల గురించి వివిధ పురాణాలలో పేర్కొన్న విధంగా పూల మొక్కలు మరియు చెట్లను ఏర్పాటు చేశారు.
ప్రతిరోజూ పూజాదికాల సమయంలో శ్రీవేంకటేశ్వర స్వామిని అలంకరించే దివ్య పుష్పాలలో, శాస్త్రీయంగా మాగ్నోలియా చంపక అని పిలువబడే సంపంగి ప్రధాన పాత్ర పోషిస్తుంది.
పురాణ ఆధారాలను అనుసరించి భవిష్యోత్తర పురాణంలోని 13వ అధ్యాయంలోని 33 మరియు 34 శ్లోకాలు ప్రాకారం శ్రీవారికి ఆలయాన్ని నిర్మించేటప్పుడు సంపంగి వనాన్ని తొలగించవద్దని సాక్షాత్తు శ్రీ శ్రీనివాసుడే స్వయంగా తొండమాన్ చక్రవర్తికి సూచించాడని తెలియజేస్తున్నది.
నేటికీ, నడిమి పడికావిలి గోపురం మరియు మహా ద్వార గోపురం మధ్య 30 అడుగుల ప్రాకారం (గోడ) సంపంగి ప్రాకారం అని పిలువబడుతున్నది.
తిరుమల ఆలయ పూజ కైంకర్యాలలో ఈ పుష్పం యొక్క ప్రాధాన్యతను మరియు చారిత్రక ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని, సంపంగి తిరుమలక్షేత్రం యొక్క వృక్షంగా గుర్తించడమైనది.
.

Discussion about this post