చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం రాచగున్నేరిలో అనుమానాస్పద స్థితిలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలు మృతి చెందారు.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన రామదాస్, నీలందేవి అనే దంపతులు రాచగున్నేరి సమీపంలోని ఓ పరిశ్రమలో కార్మికులుగా పని చేస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు.
మొదట పాప హేనకుమారి (6)తో పాటు రెండేళ్ల కుమారుడు ఉండేవారు. వీరు రాత్రి భోజనం చేసి నిద్రకు ఉపక్రమించారు. ఉదయం సుమారు మూడు గంటల ప్రాంతంలో పిల్లలు కదిలిక లేకపోవడంతో వారి తల్లిదండ్రులు హుటాహుటిన శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ కు తీసుకుని వచ్చారు.
అప్పటికే పిల్లలు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే వీరి మృతికి కారణం తెలియడం లేదు. పిల్లల తల్లిదండ్రులు కానీ… వైద్యులు కానీ కారణం ఇంకా చెప్పలేదు.
ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నపిల్లలు ఒకేసారి మరణించడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలు చనిపోవటం… శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి సిబ్బంది సైతం మరణ ధ్రువీకరణ సర్టిఫికెట్లు ఇచ్చి మృతదేహాలను తల్లిదండ్రులకు అప్పగించడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.
.