లిక్కర్ కు లాకులు ఎత్తాలా? వద్దా?

178

దేశం మొత్తం లాక్ డౌన్ అయిపోయిన నేపథ్యంలో అనేకానేక వ్యవస్థల మాదిరిగానే.. మద్యం షాపులు కూడా మూతపడిపోయాయి. అయితే మద్యం ప్రియులు మాత్రం.. మద్యం దొరక్కపోయేసరికి రకరకాలుగా అయిపోతున్నారు. తెలంగాణలో మద్యం అలవాటు ఉన్నవారు, కొన్ని రోజులుగా దొరక్కపోవడంతో మతితప్పి ఏకంగా అకాల మరణం పాలవుతున్నారు. కొందరు ఆత్మహత్యలు చేసుకుంటుండగా, కొందరు ఆస్పత్రుల్లో మరణిస్తున్నారు. తమాషా ఏంటంటే.. తెలంగాణకు సంబంధించినంత వరకు కరోనా వల్ల సంభవించిన మరణాలకంటె.. మద్యం దొరక్కపోవడం వల్ల జరిగిన మరణాల సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో ప్రభుత్వం పునరాలోచన చేస్తుందా? మద్యం తిరిగి అందుబాటులోకి తెస్తుందా? అనే చర్చ జరుగుతోంది.

కేరళలో మద్యప్రియులకు ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. వారికి ఇళ్ల వద్దకే మద్యం అందించే ఏర్పాటు చేసింది. ఇలాంటి ఏర్పాటు దిశగా తెలంగాణ సర్కారు కూడా ఆలోచిస్తుందా అనే చర్చ ఇప్పుడు నడుస్తోంది. నిజానికి ఇప్పుడున్న లాక్ డౌన్ పరిస్థితులను ఏ కొద్దిగా సడలించినా కూడా.. పూర్తిగా అదుపు తప్పిపోతుంది. అసలే కరోనా రోజురోజుకూ పెరుగుతున్న పరిస్థితుల్లో మరింత విశృంఖలంగా వ్యాపించకుండా ఉండడానికి ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇప్పుడు గనుక చిన్న సడలింపు కూడా పెద్ద నష్టం చేస్తుందని పలువురు భావిస్తున్నారు.

లిక్కర్ కు లాకులు ఎత్తేయాలని పలువురు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. రోజూ నేను మా ఆయన చెరొక క్వార్టరు తాగందే బతకలేం అని ఓ వృద్ధ మహిళ అంటున్న వీడియో కూడా సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ఇలా మద్యప్రియుల నుంచి అనేక డిమాండ్లు ఉన్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం విస్తృత సమాజ హితం దృష్టిలో ఉంచుకుని నిషేధం ఎత్తివేయకపోవచ్చుననే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

నాట్ రైట్ : జగన్ ధైర్యం చెప్పడం బాగుంది కానీ..

Facebook Comments