శ్రీకాళహస్తి పట్టణం ఈదులగుంట ఈద్గాలో శనివారం జరిగిన రంజాన్ పండుగ ప్రార్థనలో ముస్లింలతో కలసి తెలుగదేశం పార్టీ నియోజకవర్గం ఇన్ ఛార్జి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. ఈద్గాలో ముస్లింలతో కలసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ముస్లిం అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియచేశారు. రంజాన్ పండుగ రోజున ప్రార్థనలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. ముస్లింలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన అల్లాను ప్రార్ధించారు. ముస్లింల అభివృధ్ధికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందన్నారు. శ్రీకాళహస్తిలో ఎంతోకాలంగా ముస్లింలు తమ కుటుంబానికి అండగా నిలబడ్డారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో మైనార్టీ నేతలు షాకీరాలీ, బషీర్, మస్తాన్, అస్మత్, జిలానీ బాషా, ఖలీల్, షఫీ తదితరులు పాల్గొన్నారు.
.