మునిసిపల్ ఎన్నికల విషయంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తప్పలేదు. మునిసిపల్ ఎన్నికల్లో కొంతమంది అభ్యర్థులకు గడువు ముగిసిపోయిన తర్వాత కూడా.. మళ్లీ నామినేషన్లు వేసుకునేందుకు నిమ్మగడ్డ ప్రత్యేక విచక్షణాధికారాలను ఉపయోగించి ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ నిర్ణయాన్ని హైకోర్టు కొట్టివేసింది. ఆ ఆదేశాలు చెల్లవని పేర్కొంది.
నామినేషన్ల సందర్భంగా ఒత్తిళ్లు, బలప్రయోగాలు జరిగాయనే ఆరోపణలు రావడంతో.. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు. చితూరు జిల్లా తిరుపతి లో 6గురు, పుంగనూరులో 3గురు, కడప జిల్లా రాయచోటిలో ఇద్దరు తిరిగి నామినేషన్ వేసుకునేందుకు ఎస్ఈసీ అవకాశాన్ని ఇచ్చారు. దీనిపై హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిని విచారించిన కోర్టు.. ఎస్ఈసీ ఆదేశాలు చెల్లవని పేర్కొంది.
హైకోర్టులో మొట్టికాయ తప్పదని అనుమానం రావడంతో.. రేషన్ వాహనాలకు రంగులు మార్పించాలన్న ఆదేశాలను నిమ్మగడ్డ రమేష్ కుమార్, నిన్నే ఉపసంహరించుకున్నారు. ఒక్కరోజు గడవక ముందే.. ఆయన మరో దూకుడు నిర్ణయానికి హైకోర్టు నుంచి దెబ్బపడింది.
Read also these stories
ఓవరాక్షన్ మాని.. వెనక్కు తగ్గిన నిమ్మగడ్డ!
రామోజీ పత్రికల మూసివేత : ప్రకటన ఇదే..!
రామోజీ సామ్రాజ్యంలో 4 పత్రికల మూసివేత
.

Discussion about this post