• About Us
  • Contact Us
  • Our Team
Friday, August 14, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

రామోజీ పత్రికల మూసివేత : ప్రకటన ఇదే..!

సాహిత్యాభిమానులకు ధన్యవాదాలు అంటూ రామోజీ గ్రూపు నుంచి తెలుగు భాషాభిమానులకు ఒక పిడుగులాంటి వార్త వచ్చింది. తమ సాహిత్య పత్రికలు నాలుగింటిని మూసివేస్తూ.. సంస్థ చేసిన ప్రకటన పూర్తి పాఠం ఇది.

admin by admin
March 3, 2021
0
ramoji rao

రామోజీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నాలుగు మాసపత్రికలు వెలువడుతున్న విషయం తెలిసిందే. భారతీయ భాషల్లోంచే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా అనేక భాషల్లోంచి కథలను తెలుగులోకి అనువదించి అందించాలన్న లక్ష్యంతో ప్రారంభించిన మాసపత్రిక విపుల! ప్రతి నెలా ఒక నవలను అతి తక్కువ ధరకు అందించే లక్ష్యంతో మొదలుపెట్టిన పత్రిక చతుర. 1978 ఫిబ్రవరిలో ఆవిర్భవించిన ఈ జంట పత్రికలు తెలుగువారికి, అంతర్జాతీయ సాహిత్య వారధులుగా నిలిచాయి. ఈ నలభై మూడేళ్లలో విపులలో 8000 వేలవరకూ కథలు ప్రచురితం అయ్యాయి. ఇప్పటి వరకూ 518కి పైగా నవలలను అందించింది చతుర. వీటిలో కొన్ని సినిమాలుగానూ వచ్చి భేష్‌ అనిపించుకున్నాయి. ఈ పత్రికల మీద పరిశోధనలు చేసి ఎం.ఫిల్, పి.హెచ్‌.డి. పట్టాలందుకున్న వారూ ఉన్నారు.

భాషకు, సాహిత్యానికి సేవ చేసేందుకు ప్రత్యేక వేదిక ఉండాలన్న ఉద్దేశంతో 2012 సెప్టెంబరులో తెలుగువెలుగు పత్రిక ప్రారంభమైంది. ఈ తొమ్మిదేళ్లలో తెలుగువెలుగు సంచికలు 103 వెలువడ్డాయి. మన భాష, సాహిత్యం, కళలు, మాండలిక సౌరభాలను ఇప్పటి తరాలకు పరిచయం చేస్తూ, భాషోద్యమానికి దన్నుగా నిలుస్తూ వేలాది వ్యాసాలు, కథనాలను ప్రచురించింది. తెలుగు పిల్లలకు మాతృభాషలో విజ్ఞానం, వినోదం, విలువలను అందించడమే లక్ష్యంగా 2013 జూన్‌లో మొదలైన బాలభారతం పత్రిక సంచికలు 94 వచ్చాయి. జాతీయ, అంతర్జాతీయ విశేషాలు, వైజ్ఞానికాంశాలు, కథలు, వింతలూ విశేషాలు… ఒకటేమిటి పిల్లల సర్వతోముఖాభివృద్ధికి అవసరమైన సమస్త సమాచారాన్నీ అందించింది బాలభారతం.

ramoji rao magazine closure
teluguvelugu.in వెబ్ సైట్ లోని ప్రకటన సారాంశం

ఈ నాలుగు పత్రికలూ అన్ని వర్గాల వారికీ అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో నష్టాలను ఖాతరు చేయకుండా నామమాత్రపు ధరకే అందిస్తూ వచ్చాము. అంతర్జాల విస్తృతితో పాఠకుల అభిరుచులు ఊహించనంత వేగంగా మారిపోతున్నాయి. దానికి తోడు కరోనా సృష్టించిన కల్లోలం అన్ని రంగాలతోపాటు పత్రికా రంగాన్నీ తీవ్రంగా దెబ్బతీసింది. 2020 జూన్‌ నుంచి చతుర, విపులలను, ఆగస్టు నుంచి తెలుగువెలుగు, బాలభారతంలను ఈమ్యాగజైన్స్‌ రూపంలో ఈనాడు.నెట్‌లో అందుబాటులో ఉంచాము. ఇన్నాళ్లుగా సేవాదృక్పథంతో సాగిస్తూ వచ్చిన ఈ నాలుగు పత్రికల నిర్వహణ కష్టతరంగా మారినందువల్ల వచ్చే నెల (ఏప్రిల్‌) నుంచి నిలిపివేస్తున్నాము. ఇంతకాలం ఈ పత్రికలను గుండెల్లో పెట్టుకున్న భాష, సాహిత్యాభిమానులకు శిరసానమామి.

మన అమ్మభాష పరిపుష్టత కోసం ఈనాడు, ఈటీవీ, ఈటీవీ భారత్‌లు నిరంతరం కృషి చేస్తూనే ఉంటాయని సవినయంగా మనవి చేస్తున్నాము.

– మేనేజింగ్‌ ట్రస్టీ, రామోజీ ఫౌండేషన్‌

(teluguvelugu.in వెబ్ సైట్ లోని ప్రకటన పాఠం యథాతథంగా)

Tags: balabharatamchaturaeenadu dailyeenadu groupramoji foundationramoji groupramoji raoteluguveluguushodaya publicationsvipula
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

19.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన కల్లోల జీవిత చిత్రణ

12 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

26.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన సామాజిక సంక్షోభాల సజీవ చిత్రణ

ఆర్టీసీకి జరిమానా : ఇలా చేస్తే ప్రజలకే నష్టం!!

సురేష్ పిళ్లె: చదువులు వెలుగుతున్నాయా? తగలబడుతున్నాయా?

12.7.26 ‘కథానిధి’ సమీక్ష: సమకాలీన జీవిత వైరుధ్యాలు

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply