గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం భృగుబండ గ్రామంలో ఈ సంఘటన జరిగింది. ఆ స్తికోసం కొడుకు తండ్రిని కిడ్నాప్ చేశాడు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు కూడా అందింది. ఆస్తి వివాదమే కారణంగా పోలీసులు భావిస్తున్నారు.
గత కొంతకాలంగా భృగుబండ గ్రామానికి చెందిన తవిటి ఆంజనేయులుకు అతని తండ్రీ మోహన్ రావుకు మనస్పర్థలు ఉన్నాయి. ఆస్తుల విషయంలో ఇద్దరూ గొడవ పడుతున్నారు. కూతురుకు అనుకూలంగా, ఆమెకు ఆస్తి దక్కేలా తండ్రి నిర్ణయం తీసుకుంటాడని కొడుకు మండిపడుతుండేవాడు. ఈ పంపకాల వద్దనే విభేదాలున్నాయి. తాజాగా తండ్రి మోహన్ రావు, ఆయన అల్లుడు రామారావు కూడా అదృశ్యం అయ్యారు.
తన భర్త రామారావును, తండ్రి మోహన్ రావును, తన సోదరుడు ఆంజనేయులు కిడ్నాప్ చేశాడని మోహన్ రావు కుమార్తె నాగలక్ష్మి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆస్తి పంపకాల విషయంలో గొడవల కారణంగానే.. కిడ్నాప్ జరిగినట్లు ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
.

Discussion about this post