విశాఖ ఉక్కు విషయంలో పవన్ కల్యాణ్ క్రియాశీల పోరాటానికి దిగాల్సిన అవసరం ఉన్నదంటూ.. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామక్రిష్ణ జనసేనానికి హితవు చెబుతున్నారు. తెలిసో తెలియకో బీజేపీ దోస్తీ చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా తన తప్పును దిద్దుకుంటూ.. విశాఖ ఉక్కుపై నోరు విప్పాలన్నారు.
రాష్ట్ర వికాసానికి కీలకమైన ప్రత్యేక హోదాను పాచి పోయిన లడ్డుతో పోల్చిన పవన్ విశాఖ ఉక్కుపై ఎందుకు ప్రశ్నించడం లేదని రామకృష్ణ దెప్పిపొడిచారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని ఉప సంహరించుకునే వరకూ పోరాటాన్ని ఉదృతం చేస్తామన్నారు.
జగన్ పై కూడా విమర్శలు..
ప్రజా సంక్షేమానికి 90వేల ఖర్చు చేస్తున్నామంటున్న జగన్ కు ఎన్నికలంటే భయపడుతున్నారని రామకృష్ణ అన్నారు. స్వతంత్ర అభ్యర్ధులను కూడా పోటీ చేయకుండా అడ్డుకుంటూ ఏకగ్రీవాలు చేసుకోవడమేనా ప్రజాస్వామ్యమంటే అని ఆయన ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం కోనసాగితే భవిష్యత్ లో ఎన్నికలు అనేవే ఉండవని చెప్పారు. రాష్ట్రంలో వైసీపీ నేతల తర్వాత ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నది పోలీసులే అని విమర్శించారు. పోలీస్ వ్యవస్థకే ఇది మాయని మచ్చ అని, రాష్ట్రంలో ఎన్నికలను పోలీసులే నిర్వహిస్తుండటం ప్రజాస్వామ్యానికే దుర్దినం అని ఆయన అభిప్రాయపడ్డారు.
ఓ వైపు విశాఖ ఉక్కు ప్రవేటీకరణ చేస్తామని కేంద్రం ప్రకటిస్తోంటే పొడుస్తాం చించుతామంటూ రాష్ట్ర నేతలు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని అన్నారు. త్యాగాలతో ఏర్పడ్డ విశాఖ ఉక్కు ప్రెవేటీకరణను చేస్తూ లక్కల కోట్లు విలువ చేసే భూములను అమ్మకానికి కేంద్రం కుట్ర చేస్తోందని ఆరోపించారు. రాష్ట్ర బిజెపి నేతలకు ప్రధాని అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు.
ఇవీ చదవండి :
కడపలో వైసీపీ ఏకగ్రీవాల జోరు 18/50
పాపం టీడీపీ : రూల్సుంటాయి.. కానీ, పాటించలేరు!
రామోజీ పత్రికల మూసివేత : ప్రకటన ఇదే..!
రామోజీ సామ్రాజ్యంలో 4 పత్రికల మూసివేత
కలిసినట్టు కనిపించినా అలకలు చల్లారలేదే!
.

Discussion about this post