ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ కోసం గతంలో అనేక మార్లు ఢిల్లీ వెళ్లి విఫలమయ్యారు. అపాయింట్మెంట్ దొరక్క తిరిగివచ్చారు. కానీ.. అమిత్ షా మూడురోజుల పాటు తన సొంత రాష్ట్రంలో ఉంటుండగా.. జగన్మోహన్ రెడ్డి ఆయనతో కలిసి గడపడానికి తన సమయం పూర్తిగా వెచ్చించలేకపోతున్నారు.
శనివారం ఈ ఇద్దరు నాయకులూ తిరుపతి వస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి మళ్లీ ఇద్దరూ కలిసే కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. కానీ.. ఈలోగా ముఖ్యమంత్రి జగన్ మాత్రం తిరుపతిలో బసచేయబోవడం లేదు. అర్ధరాత్రి దాటిన సమయంలో తిరుపతినుంచి బయల్దేరి తాడేపల్లిలోని ఇంటికి వెళ్లిపోయి..మళ్లీ ఆదివారం మధ్యాహ్నానికి ఇక్కడకు వచ్చేస్తారు. ఎందుకింత శ్రమ తీసుకుంటున్నారు..?
అదే మరి- ఇలాంటి విషయాలే ప్రజలకు అనేకానేక సందేహాలు రేకెత్తిస్తాయి. సాధారణంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. వారం మొత్తం పనిచేసి.. ఆదివారం ఖచ్చితంగా విశ్రాంతి తీసుకుంటారు. ప్రభుత్వ పరంగా అయినా, పార్టీ పరంగా అయినా.. ఎలాంటి కార్యక్రమాలు పెట్టుకోరు. ఎవరైనా పెట్టుకున్నా ఆయన హాజరు కారు! ఆదివారం పూర్తిగా ఆయన వ్యక్తిగత జీవితానికే ప్రాధాన్యం ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి కుటుంబం క్రైస్తవాన్ని నిష్టగా పాటిస్తారు గనుక.. ఆయన ఆదివారం నాడు ప్రార్ధనల్లో విధిగా, శ్రద్ధగా గడుపుతారనేది సర్వత్రా వినిపించే మాట.
అయితే ఈ ఆదివారం ఒక ఇబ్బంది వచ్చింది. ఆదివారం నాడు తిరుపతిలో దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి మండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా సారథ్యం వహిస్తారు. ఆయన శనివారం సాయంత్రమే తిరుపతి వస్తున్నారు.
ఆ సమయానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా తిరుపతి చేరుకుని.. విమానాశ్రయంలో అమిత్ షాకు స్వాగతం పలుకుతారు. 13, 14 తేదీలకు ప్రకటించిన షెడ్యూలు ప్రకారం అక్కడినుంచి బయల్దేరి ఆయన తిరుమల వెళ్తారు. స్వామివారి దర్శనం చేసుకుంటారు. తిరిగి అమిత్ షా బసచేసిన తిరుపతిలోని తాజ్ హోటల్ కు వచ్చి.. అక్కడినుంచి అర్ధరాత్రి సమయంలో బయల్దేరి గన్నవరం ఎయిర్ పోర్ట్ చేరుకుని, తాడేపల్లిలోని ఇంటికి రాత్రి ఒంటిగంటకు వెళ్తారు.
ఎందుకంత శ్రమ.. ఆ రాత్రికి ఆయన కూడా అమిత్ షాతో పాటుగా తిరుపతిలోనే బస చేయవచ్చు కదా అనే సందేహం ఎవ్వరికైనా కలుగుతుంది. అమిత్ షా తో భేటీ కోసం గతంలో పలుమార్లు విఫలయత్నాలు చేసిన నాయకుడు.. ఇప్పుడు అలాంటి అవకాశం పుష్కలంగా దొరుకుతుండగా.. ఎందుకు వెళ్లిపోతున్నారనేది స్పష్టత లేదు. ఆదివారం ఉదయం అమిత్ షా.. ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉండడం వల్లనే.. జగన్ ఇక్కడ బస చేయకుండా వెళ్లిపోతున్నారనేది ఒక అంచనా.
అమిత్ షా.. ఆదివారం ఉదయం నెల్లూరు వెళ్లి.. అక్కడ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో కలిసి స్వర్ణభారత్ ట్రస్టు కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం తిరిగివస్తారు. తర్వాత దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి మండలి సమావేశానికి హాజరవుతారు.
జగన్ తిరుపతిలో బస చేయకుండా అర్ధరాత్రి అయినా సరే తాడేపల్లి వెళ్లిపోతుండడంపై రెండు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి :
అరెస్టు నుంచి రక్షణ కవచం.. సిఆర్‌పిసి 41 (ఎ)
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 1
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 2
ఒకటి- అమిత్ షా నెల్లూరు స్వర్ణభారత్ ట్రస్ట్ కార్యక్రమాలకు వెళ్తారు. వెంకయ్యనాయుడుతో అనుబంధం ఉన్న ఆ ట్రస్టు కార్యక్రమాలకు వెళ్లడం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం ఉండకపోవచ్చు. అందుకే తిరుపతిలో బస చేస్తే ఆదివారం ఉదయం కేంద్ర హోంమంత్రితో కలిసి వెళ్లాల్సి వస్తుంది. అది ఇష్టం లేదు గనుక.. తాడేపల్లిలో అత్యవసర పనులు ఉన్నట్లుగా అర్ధరాత్రే వెళ్లిపోతున్నారు.
రెండు- ఆదివారం ఉదయం ప్రభువు ప్రార్ధనలను మిస్ కావడం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం ఉండకపోవచ్చు. అందుకే తనకు ప్రతివారం అలవాటు అయిన సొంత నివాసంలోని చర్చిలోనే.. ప్రభువు ప్రార్ధనలు చేసుకోవడానికి ఎంత రాత్రి అయినా వెరవకుండా వెళ్తుండవచ్చు.
మొత్తానికి హోంమంత్రి ఇక్కడ బస చేస్తున్నా కూడా.. సీఎం ఒక్క రాత్రికోసం తాడేపల్లికి వెళ్లి కేవలం పన్నెండు గంటల కంటె తక్కువ వ్యవధిలోనే మళ్లీ అక్కడినుంచి రావడానికి పూనుకోవడం అనేది చర్చనీయాంశం అవుతోంది.
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
.

Discussion about this post