చిత్తూరు జిల్లా సత్యవేడు మండలం వెంకటరాజుల కండ్రిగ గ్రామానికి సమీపంలో భారీ వర్షానికి దెబ్బతిన్న సన్నకాలవ వంతెనకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టి పూర్తి చేసి వాహన రాకపోకలను పునరుద్ధరించారు. దీంతో ఆ ప్రాంత వాసులకు కష్టం కొంత ఉపశమించినట్లు అయింది.
మూడు రోజులుగా భారీ వర్షాలు కురవడంతో రాజుగుంట చెరువు నిండిపోయింది. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి చెరువు నీటిని సన్న కాలువలోకి విడుదల చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో నీటి ప్రవాహ వేగానికి ఇదివరకే తాత్కాలిక మరమ్మతులు చేసిన సన్న కాలవ తూములకు పటిష్టం చేసిన గ్రావెల్ అంతా కొట్టుకుపోయింది.
శుక్రవారం తెల్లవారుజాము నుంచే వాహన రాకపోకలు ఇరువైపులా నిలిచిపోయింది. సమాచారం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సత్యవేడు ఎంపీపీ ప్రతిమ సుశీల్ కుమార్ రెడ్డి, జెడ్పిటిసి విజయలక్ష్మి చంద్రశేఖర్ రెడ్డితో కలిసి దెబ్బతిన్న వంతెనను పరిశీలించారు.
ప్రవాహ వేగం తగ్గగానే యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు పనులు చేసి వాహన రాకపోకలను పునరుద్ధరించాలని ఎమ్మెల్యే ఆదిమూలం అధికారులను కోరారు. దీంతో ప్రవాహ వేగం తగ్గడంతో శనివారం రోడ్లు భవనాల శాఖ డిఈ అమర్నాథ్ రెడ్డి ఆదేశాల మేరకు స్థానిక ఆర్అండ్బి ఏ ఈ ఇజ్రాయిల్ చర్యలు తీసుకున్నారు.
దెబ్బతిన్న వంతెనకు ఇసుక బస్తాలు ,కంకర ,గ్రావెల్తో పటిష్టం చేయడంతో ఇటు సత్యవేడు ,అటు తమిళనాడు ఊతుకోట మార్గాలు వైపు వాహన రాకపోకలు యధావిధిగా ప్రారంభమయ్యాయి .
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
.