చిత్తూరు జిల్లా సత్యవేడు మండలం ఇరుగులం జడ్పి ఉన్నత పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం తీరుతెన్నులను స్థానిక ప్రజా ప్రతినిధులు బుధవారం పరిశీలించారు. స్థానిక ఎంపి పి ప్రతిమ సుశీల్ కుమార్ రెడ్డి, జెడ్పిటిసి విజయలక్ష్మి చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీడీవో సురేంద్రనాథ్ తదితరులు మధ్యాహ్న భోజన సమయానికి ఇరుగులం ఉన్నత పాఠశాలకు చేరుకున్నారు.
వంటగది ప్రాంగణంలోకి వెళ్లి అప్పటికే సిద్ధమై విద్యార్థులకు వడ్డిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని రుచి చూశారు. మెనూ ప్రకారం వెజిటబుల్ బిర్యాని, కుర్మా, కోడిగుడ్డు, వేరుశనగ బర్ఫీ వడ్డించడంతో పాటు నాణ్యత పట్ల స్థానిక ప్రజా ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా జెడ్పిటిసి విజయలక్ష్మి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ చదువుకుంటున్న విద్యార్థులకు బలవర్థకమైన ఆహారం అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం జగనన్న గోరుముద్ద పథకం ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శేఖర్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మధు, నీలకంఠం, మధుసూదన్ బాబు ,మస్తాన్ , బాలు ఉన్నారు .
.

Discussion about this post