పెనుమూరు మండలంలో జరిగిన కోట్ల విలువైన భూముల కబ్జాలపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టాలని సామాజిక కార్యకర్త, పెనుమూరు వాసి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.
మండల వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు ఐదు వేల ఎకరాల భూములు కబ్జాలకు గురయ్యాయని ఆయన ఆరోపించారు. ఇందులో ప్రభుత్వ భూములు, పోరంబోకు భూములు, దేవుని మాన్యాలు ఉన్నాయని చెప్పారు.
రాజకీయ పదవులు, పలుకుబడి ఉన్నవారు లంచగొండి అధికారుల సహకారంతో భూములను స్వాహా చేశారని చెప్పారు. పోరంబోకు భూములను పేదలు, దళితుల పేరుతో పట్టాలు చేయించుకుని భూస్వాములు అనుభవిస్తున్నారని తెలిపారు.
కొన్ని విలువైన భూములను నకిలీ పట్టాలు సృష్టించి స్వంతం చేసుకుని ఇండ్ల స్థలాలుగా మార్చి కోట్లు గడిస్తున్నారని చెప్పారు. చెరువులు, కుంటలు, మేతబీడు,ఇతర నిషేధిత భూములకు పట్టాలు ఇచ్చిన ఘనత పెనుమూరు రెవెన్యూ అధికారులకే దక్కుతుందని విమర్శించారు.
కాగా 20 ఏళ్ల క్రితం ఎంఅర్ఓగా పని చేసిన స్వర్గీయ మహబూబ్ బాషా పేరుతో వందల ఎకరాల భూములకు నకిలీ పట్టాలు సృష్టించి అపై ఆన్లైన్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఈ అక్రమ పనులు చేయడానికి అధికారులు భూమి విలువను బట్టి ఎకరాకు 50 వేల నుంచి 15 లక్షల వరకు లంచాలు తీసుకుంటున్నారని విమర్శించారు. పెనుమూరులో ఒరిజినల్ భూమి ఎకరం ప్లాటు వేసి అమ్మితే ఐదు నుంచి పది కోట్లు వస్తుందన్నారు. పోరంబోకు లేదా దేవుని మాన్యం అయితే అందులో సగం ధర వస్తుందన్నారు.
ఇలాంటి వ్యవహారాలలో వచ్చిన లంచం డబ్బును ఎంఆర్ఓ 50 శాతం, విఆర్ఓ 25శాతం, మిగిలిన సిబ్బంది 25 శాతం పంచుకుంటున్నారని తెలిపారు. పెనుమూరు మండలంలో పనిచేస్తున్న ఒక విఅర్ఓ ఇప్పటికి 2.60 కోట్లు గడించారాన్న ఆరోపణలు వినిపిస్తున్నాయనిఆయన చెప్పారు. ప్రభుత్వం సమగ్ర విచారణ చేపడితే అన్ని విజయాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు.
.
Discussion about this post