మహా కూటమి.. పార్టీలు పొత్తులు కుదుర్చుకోవడం వరకు ఫైనలైజ్ అయింది గానీ.. ఈ కూటమి పుబ్బలో పుట్టి మఖలో మాడిపోయే చందంగానే కనిపిస్తోంది. పొత్తులు పెట్టుకున్న నాలుగు పార్టీల మధ్య కుస్తీలు, పంతాలు, సిగపట్లు ఇప్పట్లో ఒక కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు.
కాంగ్రెస్ పార్టీ అత్యాశకు వెళుతుండడం వల్లనే.. సీట్ల పంపకంలో ప్రతిష్టంభన ఏర్పడుతున్నట్లుగా అర్థమవుతోంది. గత ఎన్నికల్లో 15 సీట్లు గెలిచిన తెలుగుదేశం ఈసారి తమకు కేవలం 19 కావాలని అడుగుతోంటే… 12 ఇస్తామని బేరం పెడుతుండడం.. 19 ఆశిస్తున్న సీపీఐ కు 3, 25 ఆశిస్తున్న తెజసకు 3 బేరం పెడుతుండడం చూస్తోంటే.. అసలు ఈ పొత్తు కొనసాగాలనే ఉద్దేశం కాంగ్రెస్ కు ఉన్నదా? లేదా? అని కూడా అనుమానాలు కలుగుతున్నాయి.
.
Discussion about this post