• About Us
  • Contact Us
  • Our Team
Saturday, September 12, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

పవన్.. మీరు వస్తే ఆ ఎఫెక్టే వేరు!

admin by admin
December 16, 2021
0
జగన్ ముందరి కాళ్లకు బంధం వేసిన పవన్ కల్యాణ్

మొత్తానికి పాదయాత్ర, తిరుమల దేవుడి దర్శనం పూర్తిచేసుకున్న అమరావతి రైతులు స్థానికంగా పోలీసుల నుంచి ఎంతగా సహాయ నిరాకరణ వ్యక్తం అయినప్పటికీ.. హైకోర్టు ద్వారా బహిరంగ సభకు అనుమతి తెచ్చుకున్నారు. అమరావతి రైతుల పాదయాత్రకు ఎంత గట్టి మద్దతు ఇతర వర్గాలనుంచి ఉంది. అది కేవలం ఒక పార్టీ ఉద్యమంగా కాకుండా.. అన్ని పార్టీల మద్దతుతో సాగుతున్న ప్రజాఉద్యమంగా కనిపించాలంటే.. బహిరంగసభలో అందరి ప్రాతినిధ్యం ఉండాలి. అందుకే ఇప్పుడు వారు ప్రయత్నిస్తున్నారు.

ఈ సభకు చంద్రబాబునాయుడు వస్తున్నారు. అయితే.. తమ డిమాండ్ మరింత గట్టిగా ప్రపంచానికి వినిపించడానికి జనసేనాని పవన్  కల్యాణ్ కూడా బహిరంగసభకు రావాలని అమరావతి రైతులు కోరుకుంటున్నారు. తిరుపతిలోని జనసేన నాయకుల ద్వారా ఈ మేరకు ఇప్పటికే పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది.

పవన్ కల్యాణ్ ఇంకా మీమాంసలోనే ఉన్నారు. శుక్రవారం నాటి బహిరంగసభకు వెళ్లాలా వద్దా నిర్ణయించుకోలేకపోతున్నారు. చంద్రబాబునాయుడు ఆల్రెడీ హాజరవుతున్న నేపథ్యంలో తనుకూడా వెళితే.. ఆయనతో కలిసి వేదిక పంచుకోవడం ఎలాంటి సంకేతాలు పంపుతుందో అని ఆలోచిస్తున్నారు.

అయితే అమరావతి రైతులు.. పవన్ కల్యాణ్ తమ బహిరంగసభకు రావాలని బలంగా కోరుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. మచ్చుకు కొన్ని..

1) అమరావతి రైతుల పోరాటం అనేది ఫక్తు తెలుగుదేశం స్పాన్సర్డ్ కార్యక్రమం అనే విమర్శ వైసీపీ వారినుంచి ఉంది. తమ సొంత డబ్బులు, విరాళాలతో పోరాడుతున్నా తెలుగుదేశం ముద్ర వేయడం వారికి బాధగా ఉంది. అలాగని.. తెలుగుదేశం వారు వచ్చి మద్దతిస్తే వద్దనే స్థితిలో లేరు. చంద్రబాబు సభకు అతిథిగా వస్తుండగా.. తమ పోరాటం మీద తెలుగుదేశం ముద్ర మరింత పడుతుందని వారి భయం. పవన్ కల్యాణ్ కూడా హాజరైతే.. తమ పోరాటానికి అన్ని పార్టీల సంపూర్ణమైన మద్దతు ఉన్నదనే సంకేతాలను ప్రజల్లోకి పంపినట్టు ఉంటుందని వారి కోరిక.

EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి

2) చంద్రబాబునాయుడు ఎంతగా నలభయ్యేళ్ల  రాజకీయఅనుభవం ఉన్న నాయకుడు అయినప్పటికీ.. తమ అమరావతి డిమాండ్‌ను దిక్కులు పిక్కటిల్లేలా వినిపిచంగల సత్తా పవన్ కల్యాణ్ కే ఉంటుందని వారి నమ్మకం. పవన్ మాటల్లో ఉండే ఆవేశం.. తమ మనోగతాన్ని చక్కగా తెలియజెబుతుందని వారి ఆశ. పవన్ మాటలు ఆవేశం తమ అమరావతి రాజధాని లక్ష్యాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్తాయని నమ్మకం.

3) రైతుల్లో చంద్రబాబునాయుడు మీద మరో అపనమ్మకం కూడా ఉంది. ఆయన పూర్తిగా అమరావతిని తన డ్రీమ్ ప్రాజెక్టుగా, తన స్వప్నంగా చెప్పుకుంటే మొదటికే మోసం వస్తుందని వారి భయం. చంద్రబాబునాయుడు.. ఘనత మొత్తం తనకే దక్కాలనే ఉద్దేశంతో.. పర్యవసానాలు పట్టించుకోకుండా.. అంతా నాదే అన్నట్టుగా మాట్లాడితే.. ఆయన పట్ల ద్వేషభావం ఉన్న జగన్మోహన రెడ్డి ఈ విషయంలో మరింత మొండిగా వ్యవహరిస్తారనే అభిప్రాయం కూడా వారికి ఉంది.

ఇన్ని కారణాల నేపథ్యంలో.. అమరావతి రైతుల బహిరంగసభకు జనసేనాని పవన్ కల్యాణ్ హాజరైతేనే ఎక్కువ మేలు జరుగుతుందని వారు కోరుకుంటున్నారు. అందుకోసం స్థానిక నాయకుల ద్వారా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అమరావతి డిమాండ్ కు తన పూర్తి మద్దతు ప్రకటించి, నాదెండ్ల తదితరులు పాదయాత్రలో పాల్గొనేలా కూడా పంపిన పవన్ కల్యాణ్ బహిరంగసభకు హాజరయ్యే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

రైక ప్రకటన : తన పరువు తానే తీసుకున్న ఈనాడు!

Tags: 17న అమరావతి సభamaravati padayatramahapadayatrapawan kalyanఅమరావతి రైతుల మహాపాదయాత్రజనసేనాని పవన్ కల్యాణ్తిరుపతి బహిరంగ సభపవన్ కల్యాణ్ తిరుపతికి
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

23 ఆగస్టు 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

9.8.26 కథానిధి సమీక్ష: అక్షరాలే అసలైన కాపలాదారులు

‘యుద్ధాలు బలికోరేది మానవత్వాన్నేనా?’

9 ఆగస్టు 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

సురేష్ పిళ్లె: ఘనీభవన స్థితి ‘కడెవర్ భారతి’

చాగంటి ప్రసాద్: యతో కృష్ణ స్తతో జయః

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply