ఎక్కడైనా బయోపిక్ తీసినా, జీవితచరిత్ర రాసుకున్నా.. జీవితంలో ఉన్న లోపాలను కూడా మాయచేసి.. పాజిటివ్ గా ప్రొజెక్టు చేసుకునేలా ఉండాలి. కానీ పాపం, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు బయోపిక్ ముసుగులో రూపొందుతున్న ‘చంద్రోదయం’ చిత్రం మాత్రం ఆయనను నవ్వుల పాల్జేసేలా ఉన్నదని.. పలువురు పార్టీ వారే బాధపడుతున్నారు. ఆ బయోపిక్‌ను కామెడీగా మారచేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు.
తెలుగు, హిందీ భాషల్లో బయోపిక్ ల హంగామా నడుస్తోంది. ఇప్పటికే హిందీలో కుప్పలు తెప్పలుగా బయోపిక్‌లు తెరపైకొచ్చేశాయి. ఇంకా వస్తున్నాయి. తెలుగులో ఈ ట్రెండ్ ఇటీవలే మొదలైంది. పరిటాల హత్యోదంతం నేపథ్యంలో `రక్తచరిత్ర` పేరుతో తొలుత రామ్‌గోపాల్‌వర్మ తెలుగులో ఈ బయోపిక్‌ల హంగామాకు శ్రీకారం చుట్టాడని చెప్పొచ్చు. ఆ తరువాత `వంగవీటి` ఇలా బయోపిక్‌ల పరంపర మొదలైంది. ఇటీవల వచ్చిన సావిత్రి బయోపిక్ అనూహ్యంగా ఆకట్టుకోవడంతో ఈ పరంపర మరింత స్పీడందుకుంది.
ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ తెరపైకి రాగా ఈ ఊపులోనే చంద్రబాబు నాయుడు జీవిత కథని తెరపైకి తీసుకొస్తున్నారు. `చంద్రోదయం` పేరుతో రూపొందుతున్న ఈ సినిమా పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుగా వుంది. ఎన్టీఆర్ బయోపిక్‌లో పేరున్న క్రేజీ నటులు నటిస్తుంటే `చంద్రోదయం`లో మాత్రం పేరులేని…ఇండస్ట్రీ వర్గాలకే తెలియని వాళ్లు నటిస్తున్నారు. చంద్రబాబు పాత్రలో నవీనోద్ నవ్వుల నటిస్తున్న ఈ చిత్రం సినీ వర్గాల్లో నవ్వులు పూయిస్తోంది. `చంద్రోదయం` పేరుతో కామెడీ చేస్తున్నారని, ఇది అధినేత చంద్రబాబుకు అర్థం కావడం లేదని టీడీపీ శ్రేణులు నెత్తీనోరు బాదుకుంటున్నారట.
.
Discussion about this post