సీబీఐ రంగంలోకి దిగింది. న్యాయమూర్తులపై ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేసే వారిపై ఆరా తీస్తోంది. వివరాల స్వీకరణ ముగిసింది. ఇక విచా‘రణ’ పర్వమే..
ఏపీ ఏపీ హైకోర్టు న్యాయమూర్తులను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారితోపాటు న్యాయవ్యవస్థపై ఇష్టమొచ్చిన రీతిలో వ్యాఖ్యలు చేసిన నేతలను సిబిఐ విచారించనుంది. ఇందులో భాగంగా కేసుకు సంబంధించి ప్రాథమిక సమాచారాన్ని విశ్లేషిస్తోంది. ఇప్పటికే సిఐడి నమోదు చేసిన ఎఫ్ ఐ ఆర్ కాఫీ లను, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఇచ్చిన ఫిర్యాదును సి.బి.ఐ తీసుకుంది. న్యాయవ్యవస్థను, న్యాయమూర్తులను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి హైకోర్టు లిస్ట్ ఆఫ్ జనరల్ కు ఫిర్యాదు చేసిన న్యాయవాది లక్ష్మీనారాయణను, ఆదివారం అయినప్పటికీ, సిబిఐ పిలిపించి వివరాలను నమోదు చేసుకుంది. ఫిర్యాదుకు సంబంధించి లక్ష్మీనారాయణ వద్ద ఉన్న ఆధారాలను తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పై వివిధ సందర్భాలలో కేసుల విచారణ సందర్భంగా హైకోర్టు పలు వ్యాఖ్యలను చేసింది. కొన్ని కేసులలో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్పులు వచ్చాయి. మరికొన్ని నిర్ణయాలపై స్టే విధించింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో పలువురు హైకోర్టు న్యాయమూర్తులను కించపరుస్తూ పోస్ట్ పెట్టారు. మరికొందరు వైకాపాకు చెందిన నేతలు మీడియా సమావేశాల్లో న్యాయ వ్యవస్థ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వీటన్నింటిపై న్యాయవాది లక్ష్మీనారాయణ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన హైకోర్టు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని పోలీసులను ఆదేశించింది. ప్రభుత్వం ఈ కేసును cid కి అప్పగించింది. అయితే కేసు దర్యాప్తులో పురోగతి లేకపోవడంతో కేసును సిబిఐకి అప్పగిస్తూ హైకోర్టు ఆదేశించింది. సిబిఐకి నిర్ణీత గడువు విధిస్తూ పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
కేసు దర్యాప్తులో భాగంగా సిబిఐ వారంరోజులుగా దూకుడు పెంచింది. రిజిస్ట్రార్ జనరల్ కు అందిన లేక, సిఐడి నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లను తీసుకుని పరిశీలించింది. హైకోర్టు న్యాయవాది లక్ష్మీనారాయణను ఆదివారం పిలిపించుకొని ఆయన వద్ద ఉన్న ఆధారాలను సేకరించింది. ఈ నేపథ్యంలో పోస్టింగులు పెట్టిన వారితోపాటు మీడియా సమావేశాల్లో వివిధ సందర్భాల్లో వ్యాఖ్యలు చేసిన వైకాపా నేతలు విజయసాయిరెడ్డి, నందిగామ సురేష్, పండుల రవీంద్ర బాబు, ఆమంచి కృష్ణమోహన్ తదితరులతోపాటు డిప్యూటీ సీఎం నారాయణస్వామి, స్పీకర్ తమ్మినేని సీతారాం లను తప్పక విచారణ చేస్తారని న్యాయవాది లక్ష్మీనారాయణ ప్రకటించారు.
.

Discussion about this post