రోజు రోజుకు ఆడబిడ్డల భద్రత కరువవుతూనే ఉంది కఠినమైన శిక్షలు లేకే మహిళలకు బతుకులు బుగ్గిపాలవుతు ఉన్నాయంటూ ధ్వజమెత్తిన తిరుపతి పార్లమెంట్ తెలుగు మహిళా అధ్యక్షురాలు చక్రాల ఉష.
రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై నిమ్మకు నీరెత్తినట్టు ఒక్క అత్యాచారంపై కూడా మాట్లాడని జగన్మోహన్ రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే గడిచిన రెండేళ్లలో 1500 పైగా జరిగిన లైంగిక, వేధింపులు,అత్యాచార ఘటనలు జరిగాయని ఇవన్నీ వైసిపి అసమర్థ పాలనకు అద్దం పడుతున్నాయని, ఒక్కరికి కూడా శిక్ష పడలేదు ముఖ్యమంత్రి, డీజీపీ, హోం మంత్రి,మహిళా కమీషన్ నివసించే ప్రాంతాల్లో కూడా వరుస అత్యాచార ఘటనలు జరగడం ప్రభుత్వ శాంతిభద్రతల వైఫల్యాలకు కళ్ళకు అద్దం పడుతున్నాయని,
రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై జరిగే దాడులను ఎక్కువ శాతం వీళ్ళు నివసించే ప్రాంతాలలో జరిగాయని, దేశంలో మహిళలపై జరిగే దాడుల్లో ఏపీ మొదటి స్థానంలో ఉందని, మానవ అక్రమ రవాణాలో ఏపీ రెండో స్థానంలో ఉందని, అలాగే ఎస్ సి ల పై జరిగే దాడులలో 5వ స్థానంలో ఉందని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులపై విద్యార్థినుల భద్రత లో లోపాలు సరిచేయాలని మహిళా మంత్రి హోం మంత్రి కనీసం స్పందించడం లేదని మానవత్వంతోనన్నా హోంమంత్రి స్పందించాలని ఈ సందర్భంగా ఆమె డిమాండ్ చేశారు,
అలాగే ఈ ప్రభుత్వం దిశ యాప్ తెచ్చాము మహిళల దిశ తిరుగుతుందన్నారు కానీ నేడు ఈ ప్రభుత్వం మహిళా భద్రతకు ప్రభుత్వ ఖజానా నుండి పైసా కూడా ఖర్చు చేయకుండా కేంద్రం ఇచ్చిన కోట్లు నిధులను కొంతమేరా కోట్లు ఖర్చుపెట్టి మిగతా నిధులను దుర్వినియోగం చేయడం దుర్మార్గపు చర్య అని, చిన్నారులకు నేను మేనమామ అని చెప్పుకునే కంసమామ ముఖ్యమంత్రి
అభం, శుభం తెలియని పసి, పిల్లల జీవితాలను చిదిమేస్తున్న మీ పార్టీ నాయకులు, రౌడీలను కట్టడి చేయకుండా కళ్ళముందే ఇన్ని ఘోరాలు జరుగుతుంటే వేడుక చూస్తూ నోరు మెదపక పోవడం సిగ్గు చేటని ఎద్దేవా చేశారు.ఈ కార్యక్రమంలో రేణుకదేవి, సుమతి, దుర్గా ఊహ, శ్రీలక్ష్మి,సుజాత, ప్రియాంక,తదితరులు పాల్గొన్నారు.
.