చంద్రగిరి మండలం రాయలపురం గ్రామ పంచాయతీ సిర్డ్స్ సంస్థ వారి ఆర్థిక సహకారంతో సహకారంతో రాయలపురం లోని వరద బాధిత కుటుంబాలకు 18 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ జరిగింది.
ఈ కార్యక్రమానికి రాయలపురం గ్రామ సర్పంచ్ వెంకటయ్య ముఖ్య అతిగా విచ్చేసారు.
వెంకటయ్య మాట్లాడుతూ అకాల వర్షాల వలన వరదలతో చెరువులు నిండి నీరు అంతా గ్రామాల మీదుకు రావడంతో వరద నీరు అంతా ఇంట్లోకి చేరి చాలా ఇబ్బంది పడుతున్నా వలస కార్మిక కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసి వారి కుటుంబాలకు అండగా నిలుస్తున్న సిర్డ్స్ సీర్డ్స్ సంస్ధ సభ్యులకు చాలా ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీర్డ్స్ సంస్ధ కార్యదర్శి మారుపురి శేఖర్ మాట్లాడుతూ ఈ లాక్ డౌన్లోడ్ కానీ వరదలతో బాధపడుతున్నా పేద కుటుంబాలకు దాదాపుగా 2500 కుటుంబాలకు సిర్డ్స్ సంస్థ ఫౌండేషన్ నిత్యావసర సరుకులు అందజేసిందన్నారు.
మునుముందు కూడా సిర్డ్స్ సంస్థ మీకు ఎప్పుడు అండగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రీడ్స్ సంస్థ కార్యదర్శి మునిచంద్ర గారు మాట్లాడుతూ రీడ్స్ సంస్థ ఎక్కడా విపత్తులు జరిగిన అక్కడ సేవ చేయడానికి ముందు ఉంటుంది అన్నారు.
అందులో భాగంగా ఈ రోజు రాయలపురం నందు 18 రకాల నిత్యావసర సరుకులు నెలకు సరిపడా వరద బాధిత కుటుంబాలకు ఇవ్వడం జరిగింది. దీనికి సహకరించిన దాతలు అందరికి ధన్యవాదాలు తెలిపారు.
కార్యక్రమంలో యువతేజం ట్రస్ట్ కరీముల్లా, సిర్డ్స్ సంస్థ వాలంటీర్స్ లోకేష్, సతీష్,గ్రామ సర్పంచ్ మరియు ఇతర నాయకులు అందరూ పాల్గొన్నారు
Discussion about this post