విద్యార్థులు తమ వ్యక్తిత్వానికి తగిన వృత్తినే ఎంపిక చేసుకోవాలని తిరుపతి ఐఐటి అంతర్జాతీయ అధికారి ఎన్ బి హర్షవర్ధన్ రెడ్డి సూచించారు. సోమవారం ఏర్పేడు మండలం నాగం పల్లె వద్ద వున్న ఎస్ఓఎస్ పిల్లల గ్రామంలో, ఎస్ఓఎస్, ఆల్స్టమ్ ఫౌండేషన్ అధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కెరీర్ ఎంపికపై అవగాహన కల్పించారు.
విద్యార్థులు ఇంటర్ మీడియట్ లోపలే సరైన కెరీర్ ఎంపికకు పునాదులు వేసుకోవాలని చెప్పారు. వృత్తిలో ప్రగతి సాధించడానికి సామర్ధ్యం, అభిరుచి, నైపుణ్యం, శిక్షణ ప్రధానమని తెలిపారు. అలాగే జ్ఞానం, అనుభవం, సాధన, లక్ష్యం మూలమని చెప్పారు.
పిల్లలు వృత్తి ఎంపికలో గందరగోళానికి గురైనప్పుడు తల్లితండ్రులు, ఉపాధ్యాయులు సరైన మార్గదర్శనం చేయాలని కోరారు. విద్యార్థి దశ పూర్తయిన తరువాత జీవితాంతం ఆధార పడవలసిన వృత్తి ఎంపికలో జాగ్రత్త అవసరం అన్నారు. అలాగే వృత్తి ఎంపిక చేసుకునే సమయంలో దాని పరిధి, అవకాశాలు, ఆర్థిక పరిస్థితులను పరిశీలించాలని చెప్పారు. ప్రతి వ్యక్తి స్వీయ విశ్లేషణ ద్వారా తనలోని బలాలు, బలహీనతలు, అవకాశాలు, అవరోధాలు తెలుసుకోవాలన్నారు.
తాము ఎంచుకునే వృత్తికి సమాజంలో ఉన్న ఆదరణ, అవకాశాల పట్ల అవగాహన పెంచుకోవాలని సూచించారు. వృత్తి అనగానే మెడిషన్, ఇంజనీరింగ్ మాత్రమే అనుకోకుండా ఇతర అనేక అంశాలను పరిశీలించాలన్నారు. డబ్బు సంపాదనే కాకుండా సేవా దృక్పథంతో పనిచేయాలని కోరుకునే వారు అందుకు తగిన రంగాలను ఎంచుకోవాలని చెప్పారు.
కార్యక్రమంలో శ్రీకాళహస్తి, ఏర్పేడు మండలాలకు చెందిన ఎనిమిది నుంచి ఇంటర్ వరకు చదివే విద్యార్థులు పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.
.

Discussion about this post