మూడేళ్ల కు పైగా నిర్మాణంలో వుండి, మూడు వందల కోట్ల రూపాయల ఖర్చు తో నిర్మించి ఎన్నో అంచనాలతో వచ్చిన హీరో ప్రభాస్ పాన్ ఇండియా సినిమా రాధే శ్యామ్ ప్రేక్షకులను అలరించిందనే చెప్పాలి.
కథ విషయానికి వస్తే, విక్రమ్ ఆదిత్య (ప్రభాస్) ప్రపంచ ప్రఖ్యాత హస్త సాముద్రికుడు. కొన్ని కారణాల వల్ల ఇటలీలో నివసిస్తుంటాడు. డాక్టర్ ప్రేరణ (పూజా హెగ్డే) కుటుంబం ఇటలీ లో స్థిర పడుతుంది. వారి ఇద్దరి మధ్య జరిగిన విచిత్ర ప్రేమ కథ. విధి బలీ యమైనది అని చెబుతూనే, మానవ ప్రయత్నం గొప్పది అనే సందేశం ఇచ్చాడు దర్శకుడు.
పాన్ ఇండియా సినిమా అవడం వల్ల రాధే శ్యాం బిన్నంగా ఉంటుంది. గొప్ప విషయం ఏమిటంటే దర్శకుడు రాధా కృష్ణ కుమార్ తను అనుకున్న క్లిష్టమైన పాయింట్ ను తడబడ కుండా చెప్పగలిగాడు. పెట్టిన ఖర్చు తెరపై కనబడుతుంది. ఇటలీ చాలా అందంగా చూపించారు. గ్రాండ్ గా తీశారు. కథ కొంత బలహీనంగా ఉన్నా, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి.
మనోజ్ పరమహంస కెమెరా పనితనం గొప్పగా వుంది.
కోటగిరి వెంకటేశ్వర రావు ఎడిటింగ్ బావుంది.
ఎస్. తమన్ నేపథ్య సంగీతం సినిమాకు మంచి మూడ్ ను సెట్ చేసింది.
జస్టిన్ ప్రభాకరన్ సమకూర్చిన పాటలు వినసొంపుగా వున్నాయి.
రవీంద్ర కళ దర్శకత్వం ప్రతి ఫ్రేమ్ లో కనపడుతుంది.
కథ లో చాలా లోపాలు ఉన్నాయి. స్క్రీన్ ప్లే తో కవర్ చేశాడు దర్శకుడు.
నటీనటుల విషయానికి వస్తే, ప్రభాస్ బాగా చేశాడు. అయితే అక్కడక్కడా అతని ముఖంలో సిక్ లుక్ కనపడింది. పూజా హెగ్డే అద్భుతంగా నటించింది. చాలా అందంగా కనపడుతుంది. లోకేషన్స్, సెట్స్, కాస్ట్యూమ్స్ గొప్పగా ఉన్నాయి. మరాఠీ నటుడు సచిన్, భాగ్య శ్రీ, మిగతా వారందరూ తమ పాత్రల్లో సరిపోయారు. లాజిక్ మిస్ అయినా
మేజిక్ పనిచేసింది చాలా చోట్లా.

.