• About Us
  • Contact Us
  • Our Team
Wednesday, July 22, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

Good Morning : ఇతరుల అనుభూతులతో కలిసి..

admin by admin
December 16, 2021
0
Good Morning : మరచిపోవలసినది ఏది?

వ్యక్తి.. సంఘజీవి. తాను ఒక్కడే ఒక యూనిట్‌గా భావిస్తాడా? లేదా తన చుట్టూ ఉన్న మనుషుల్ని కూడా కలుపుకుని.. ఒక సమష్టితనాన్ని ఒకే యూనిట్‌గా భావిస్తాడా అనేది చాలా కీలకమైన సంగతి.

సంతోషాలను ఒంటరిగా సెలబ్రేట్ చేసుకునే వాళ్లు, బాధ కలిగితే ఒంటరిగా కుమిలే వాళ్లూ కూడా ఉంటారు. ఏ అనుభూతినీ వారు ఎవ్వరితోనూ పంచుకోరు.

అదే సమయంలో తన సంతోషాన్ని ఒంటరిగా, దుఃఖాన్ని నలుగురితో కలిసి అనుభవించాలని అనుకునే వారు కొందరుంటారు. బాధానందాలు రెండూ నలుగురికీ పంచేసే వ్యక్తులు ఉంటారు. ఇవన్నీ దాటిన తర్వాత.. ఇతరుల బాధానందాలు కూడా సమస్తంగా స్వీకరించేవాళ్లు కొందరే ఉంటారు.

అలాంటి వారి గురించి మనకు ఈ సుభాషితం చెబుతుంది.

మైత్రీ కరుణా ముదితోపేక్షాణాం
సుఖ దుఃఖ పుణ్యాపుణ్య విషయాణాం
భావనాతశ్చిత్తప్రసాదనం

ఇతరుల సంతోషాలను చూసి సంతసించడం, ఇతరుల దుఃఖాలను చూసి బాధపడడం, ఇతరులు ఘనవిజయాలు సాధించినప్పుడు మనం కూడా ఆ ఆనందాన్ని పొందడం, ఇతరుల దుర్మార్గాలు, దుష్కార్యాల విషయంలో ఉపేక్షించడం- అదే పనిగా వాటి గురించే మాట్లాడుకుంటూ, మధనపడుతూ ఉండకపోవడం.. లాంటి ప్రతిస్పందనలు మనలో చోటు చేసుకుంటూ ఉండాలి. ఇలాంటి ప్రతిస్పందనలు మనల్ని మానవత్వం ఉన్న మంచి మనిషిగా తీర్చిదిద్దుతాయి. -అనేది శ్లోకభావం

చిన్నదే అయినా గొప్ప అంతరార్థం ఉన్న సుభాషితం ఇది. నిజానికి ఈ సుభాషితం చెప్పే అన్ని లక్షణాలూ అంతో ఇంతో మనకు స్వానుభవంలో తప్పకుండా ఉంటాయి. మన కుటుంబ సభ్యులు, మనకు బాగా సన్నిహితుల విషయంలో మనకు ఇది తెలుస్తుంది. వారి బాధానందాలు మనకు కూడా వర్తిస్తుంటాయి. ఉదాహరణకు ఇంట్లో కొడుకు ఒక గొప్ప ర్యాంకు సాధించాడంటే.. ఇల్లంతా ఆ సందర్భాన్ని పండగ చేసుకుంటారు. కుటుంబంలో ఒకరికి నష్టం జరిగితే.. ఆ దుఃఖం కూడా అందరికీ ఉంటుంది. కుటుంబసభ్యుల్లో చిన్న లోపం ఉన్నప్పుడు.. దాన్ని పట్టించుకోకుండానే, ఉపేక్షించి.. తతిమ్మా కుటుంబం ఆదరిస్తుంది. అదే పనిగా ఆ లోపం గురించి రాద్ధాంతం చేయదు.

ఈ సంగతి అర్థం చేసుకుంటే.. మనకు సుభాషితం చెప్పే నీతి కూడా అర్థమైపోతుంది. మనం సొంత కుటుంబంగా భావించే వారి విషయంలో వారి ప్రతి అనుభూతిని మనదిగా చేసుకోగలుగుతున్నాం. వారి మంచిని స్వీకరిస్తున్నాం.. చెడును ఉపేక్షిస్తున్నాం. ఈ భావన ‘అందరిపట్లా’ ఉండాలంటుంది సుభాషితం. వసుధైక కుటుంబం అనే భావనను మరో రకమైన మాటల్లో వ్యక్తీకరించే సుభాషితం ఇది. కుటుంబభావనలో మన సకల అనుభూతులు సానుకూల వైఖరితో ఉంటాయి.

కుటుంబం అనే గీత దాటి బయటకు రాగానే.. మనలో నెగటివ్ ఆలోచనలు ప్రవేశిస్తుంటాయి. ఎదుటి వాడు సుఖంగా సంతోషంగా ఉంటే మనకు కాస్త కినుక అనిపిస్తుంది. ఎదుటి వాడు దుఃఖంలో సతమతం అవుతోంటే.. కించిత్ ఆనందం కలుగుతుంది. ఎదుటివాళ్ల విజయాలను చూసి ఓర్వలేం.. ఇలాంటి లక్షణాలు మనలో పొడసూపుతూ ఉన్నప్పుడు.. ఇక ఏ రీతిగా మనం మంచి వ్యక్తిగా ఉంటాం. మంచి వ్యక్తి అంటే.. ఏదో మహనీయుడుగా మనల్ని మిగిలిన ప్రపంచం గుర్తించడం మాత్రమే కాదు. కనీసం మనం ఆరోగ్యంగా ఉండడం.

ఇతరులను చూసినప్పుడల్లా.. ఇన్ని విషపూరిత నెగటివ్ ఆలోచనలు మనల్ని చుట్టుముడుతున్నప్పుడు.. మనకు సరైన ఆరోగ్యం మాత్రం ఎలా ఉంటుంది? ఇతరుల అనుభూతులల్లో మనల్ని మనం మమేకం చేసుకోనంత వరకు, ఇతరుల అనుభూతులను గమనిస్తూ.. వాటికి విరుద్ధంగా వర్తిస్తున్నంతవరకు మన ఆలోచనకూడా రుజుమార్గంలో సాగుతున్నట్టు కాదు. మన ఆరోగ్యం కూడా సజావుగా ఉన్నట్టు కాదు. ఈ విషయాన్ని బోధపరచుకుంటే.. వసుధైక కుటుంబం నిర్వచనానికి తగినట్టుగా ప్రపంచమంతటితోనూ మనం మమేకం కాగలుగుతాం.

శుభోదయం

Tags: BhartrihariBhartrihari subhashithamgood morninggood morning thoughtquotes on good thoughtssubhashitamsubhashithamభర్తృహరి సుభాషితంమంచిమాటశుభోదయంసుభాషితం
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

28 జూన్ 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

5 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

28.6.26 ‘కథానిధి’ సమీక్ష: వర్తమాన సామాజిక వాస్తవికత

12 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

5.7.26 ‘కథానిధి’ సమీక్ష: సామాజిక రుగ్మతలపై అక్షరాల తిరుగుబాటు

12.7.26 ‘కథానిధి’ సమీక్ష: సమకాలీన జీవిత వైరుధ్యాలు

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply