మనకు స్నేహితులు, శత్రువులు ఉంటారు. కొత్తగానూ ఏర్పడుతుంటారు. మధ్యలో దూరం అవుతూనూ ఉంటారు. ఈ బంధాలు ఎలా పుడతాయి? ఎలా బలపడతాయి? ఎలా అంతరించిపోతాయి? చాలా పెద్ద మీమాంస ఇది.
కొన్ని బంధాలు పుట్టడం యాదృచ్ఛికంగా జరగవచ్చు. సాధారణంగా ఆసక్తులు, ఇష్టాలు కలిసినప్పుడే స్నేహం పుడుతుంటుంది. ఆ ఇష్టాలలో తేడా వచ్చినప్పుడే శత్రుత్వమూ పుడుతుంది. పుట్టుకకు ఇది మూలమే గానీ.. బలపడడానికి కారణాలు వేరు. అవి అంతరించిపోవడానికి కూడా కారణాలు వేరు.
అలాంటి కారణాలను విశ్లేషించే ప్రయత్నం చేస్తుంది ఈ సుభాషితం..
న కశ్చిత్ కస్యచిన్మిత్రం న కశ్చిత్ కస్యచిత్ రిపుః
అర్థతస్తు నిబధ్యన్తే మిత్రాణి రిపువః తథా
ఏ ఒక్కరూ కూడా ఎవ్వరికీ మిత్రుడు కాదు. ఏ ఒక్కరూ కూడా ఎవ్వరికీ శత్రువు కాదు. అవసరం మాత్రమే మిత్రత్వానికి శత్రుత్వానికి కట్టుబడి ఉండేలా చేస్తుంది. – అనేది శ్లోకభావం
మనకుండే చాలా స్నేహ బంధాలలో చిన్న వయసులో పుట్టేవి ఉంటాయి. అందులో చాలావరకు యాదృచ్ఛికంగానే పుడతాయి. ఇష్టాలు, ఆసక్తుల ప్రాతిపదికమీదనే పుడతాయి. స్కూల్లో మన క్లాసులో యాభైమంది పిల్లలు ఉన్నారనుకుంటే.. మొత్తం యాభై మందితోనూ మనకు సమానమైన స్నేహం ఉండదు. మన ఆసక్తులతో మ్యాచ్ అయ్యే వారితోనే స్నేహం కుదురుతుంది.
బంధం ఎలా బలపడుతుంది. ఇష్టాల మీదనే బలపడడం ఒక ఎత్తు. కానీ కొన్ని సందర్భాలలో ‘అవసరం’ మీద బలపడుతుంది. సుభాషితం చెప్పే ప్రకారం.. సహజంగా ఎవ్వరూ ఎవ్వరికీ మిత్రులుగానూ, శత్రువులుగానూ ఉండరు. ‘అవసరం’ మాత్రమే వారిని ఆయా రూపాల్లోకి మారుస్తుంటుంది.
మీరు ఇష్టాలను, అవసరాలను పట్టించుకోని, పరిగణనలోకి తీసుకోని వ్యక్తి అనుకోండి. అప్పుడు అందరూ మీకు సమానమే అవుతారు. అందరూ మైత్రీ శత్రుత్వాల ప్రసక్తే ఉండదు. ‘సర్వత్ర సమబుద్ధయః’ అనే తత్వం కూడా అలవడుతుంది.
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సుభాషితం ఇలా చెబుతుంది గానీ.. అవసరాలు, ఇష్టాలు పరిగణనలోకి తీసుకోకుండ ఎలా ఉండగలం? ఎలా మనగలం? అయితే- మన స్నేహ బంధాలను ఇలాంటివి ప్రభావితం చేస్తాయి అనే స్పృహ కలిగి ఉంటే.. వాటికి లోబడకుండా జాగ్రత్తపడొచ్చు. స్నేహం కుదిరిన తర్వాత.. ఇష్టాలు వేరు కావొచ్చు.. అయితే ఈ స్పృహ ఉన్నప్పుడు.. స్నేహం పలుచన కాకుండా ఉంటుంది.
శుభోదయం
.

Discussion about this post