తిరుపతి జిల్లా పరిధిలోని శ్రీకాళహస్తి రెవిన్యూ డివిజనల్ అధికారిగా డి.హరితను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. హరిత ప్రస్తుతం తిరుపతి నగర పాలక సంస్థ అదనపు కమిషనరుగా పని చేస్తున్నారు.
జిల్లాల పునర్విభజనలో భాగంగా శ్రీకాళహస్తిని రెవిన్యూ డివిజనుగా మార్చిన సంగతి తెలిసిందే. సోమవారం నుంచి శ్రీకాళహస్తి రెవిన్యూ డివిజనుగా ఉంటుంది.
నూతనంగా రెవిన్యూ డివిజనుగా ఏర్పాటైన శ్రీకాళహస్తికి మొట్టమొదటిగా మహిళను ఆర్డీవోగా నియమించారు. ఆర్డీవోగా నియమించబడిన హరిత సోమవారం బాధ్యతలు తీసుకోనున్నారు.
నూతన ఆర్డీవో కార్యాలయం శ్రీకాళహస్తి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ఆవరణలో గల రైతు విశ్రాంతి భవనంలో సోమవారం ఉదయం 9గంటలకు ప్రారంభించనున్నారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం శ్రీకాళహస్తి శాసనససభ్యులు బియ్యపు మధుసూదనరెడ్డి చేతుల మీదుగా జరుగనుంది.

.