ఎమ్మెల్యే ఎన్నికల పోలింగ్ శాతంతో.. మునిసిపాలిటీ ఎన్నికల పోలింగ్ శాతాన్ని ఏమాత్రం కరెక్టు కాదు. కానీ. ఒక మేరకు అంచనా వేయడానికి మాత్రమే అది ఉపయోగపడుతుంది. ఆ లెక్కల ప్రకారం చూసినప్పుడు.. గత ఎమ్మెల్యే ఎన్నికలో పోలిస్తే పదిశాతం వరకు తగ్గిన పోలింగ్.. ఈ మునిసిపాలిటీ ఎన్నికల్లో ఎవరికి మేలు చేస్తుందో సస్పెన్స్ గానే ఉంది.
కుప్పం మున్సిపాలిటీకి సోమవారం జరిగిన ఎన్నికలలో మొత్తం 76.49 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 24 వార్డుల పరిధిలో 28,808 మంది ఓటు వేయడం జరిగిందని కుప్పం మున్సిపల్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి చిట్టిబాబు తెలిపారు.
ఈరోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ను నిర్వహించడం జరిగిందని ఇందుకోసం భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పోలింగ్ అనంతరం 48 పోలింగ్ స్టేషన్లలో గల బ్యాలెట్ బాక్సులను భారీ బందోబస్తు మధ్య స్థానిక ప్రభుత్వ ఓకేషనల్ కాలేజీలో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూముకు చేర్చడం జరిగింది. పోలింగ్ సరళిని రాష్ట్ర పరిశీలకులు ఎన్. ప్రభాకరరెడ్డి పలు పోలింగ్ కేంద్రాలలో పరిశీలించారు.
ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, చెదురుమదురు సంఘటనలు జరిగాయని రిటర్నింగ్ అధికారి తెలిపారు. ఎన్నికల పరిశీలకులు పోలింగ్ తీరును పర్యవేక్షించిన మైక్రో అబ్జర్వర్ లతో సమీక్ష నిర్వహించారు. 17వ తేదీన ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ జరుగుతుంది.
.