• About Us
  • Contact Us
  • Our Team
Wednesday, October 14, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

‘భద్రం బీ కేర్ ఫుల్ బ్రదరూ..’ లేటెస్ట్ యాంగిల్!

admin by admin
December 23, 2021
0
‘భద్రం బీ కేర్ ఫుల్ బ్రదరూ..’ లేటెస్ట్ యాంగిల్!

దుబాయి రాజు మఖ్తూం నుంచి ఆయన భార్యకు విడాకులు మంజూరు అయ్యాయి. ఈ తీర్పు చెబుతూ బ్రిటన్ కోర్టు 5500 కోట్ల రూపాయలు సదరు మాజీ భార్యకు, ఆమె పిల్లలకు చెల్లించాలని తీర్పు చెప్పడం తాజా సంచలనం. 72ఏళ్ల రాజుకు, 47 ఏళ్ల భార్య ఆమె! తన అంగరక్షకుడితో అక్రమ సంబంధం కలిగిఉన్నదని ఆమె గురించి ఓ వదంతి ఉంది. పైగా జోర్డాన్ ఒకప్పటి రాజు కుమార్తె. 2000లో ఒలింపిక్స్ లో షోజంపింగ్ (గుర్రంపైనుంచి చేసే విన్యాసం) లో పాల్గొన్న సాహసి. ముచ్చటపడి దుబాయ్ రాజు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మఖ్తూం పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు దాంపత్యజీవితం బెడిసికొట్టడం తర్వాత.. భరణంగా రూపేణా హరించుకు పోనున్న సంపద చూసుకుని గొల్లు మనే పరిస్థితి. ఆ నేపథ్యంలో.. అసలు వివాహ వ్యవస్థ- ఎన్ని రకాల కొత్త రూపాలు సంతరించుకుంటోంది. ఎలాంటి పరిణామాలు ఇంకా రానున్నాయి అని విశ్లేషిస్తున్న సీనియర్ జర్నలిస్టు కృష్ణ సాయిరాం వ్యాసం.. adarsini.com కోసం ప్రత్యేకం

‘వైవాహిక బంధం వర్సెస్ వ్యక్తిగత స్వేచ్ఛ’ ఈ రెండింటిలో దేనికి సమాజం పెద్దపీట వేయాల్సిన అవసరం ఉంటుంది? ఈ రెండూ పరస్పర విరుద్ధమైన ప్రయోజనాలా? లేక ఒకదానికి మరొకటి అనుసంధానమైనటువంటి అంశాలా అనేవిషయం తాజాగా మరోసారి చర్చనీయాంశంగా మారుతోంది.

అసలు వివాహ వ్యవస్థ ఎందుకు ఎప్పుడు ఎలా ఏర్పడింది? ఈ వివాహ వ్యవస్థలో ఏరకమైన సామాజిక ప్రయోజనాలున్నాయి? వివాహం వల్ల కలిగేటటువంటి లాభనష్టాలు ఏమిటి? ఇవన్నీ కూడా చర్చకు వచ్చినపుడు అసలు ఈ వివాహ వ్యవస్థ ఏరకంగా పుట్టింది? దీని పుట్టుక ద్వారా ఆశించిన ప్రయోజనాలు ఎంతవరకూ నెరవేరుతూ వస్తున్నాయి? ఇపుడు జరుగుతున్న చర్చలో వ్యక్తిగత స్వేచ్ఛ అల్టిమేట్ రైట్ గా వివాహ బంధంకంటే మించినదిగా మారుతోంది.

అంటే పేరులోనే సూచించిన విధంగా వ్యక్తిగత స్వేచ్ఛ అంటే ఒక వ్యక్తి తనకు సంబంధించి అపరిమితమైన నిర్ణయాలు తీసుకునే జీవన విధానంగా చూడాలి. అదేసమయంలో వైవాహిక బంధం అంటే ఇందులో ఉన్న బంధం అంటే బంధనం.. మరో వ్యక్తి జీవితంతో ముడిపడివున్న బంధం. ఇందులో వ్యక్తిగత స్వేచ్ఛతో పోల్చుకుంటే కొన్ని పరిమితులు ఉండే అవకాశం ఉంటుంది.

చట్టపరంగా న్యాయస్థానాలు ఇస్తున్న తీర్పులను చూస్తే వైవాహిక బంధంకంటే వ్యక్తిగత స్వేచ్ఛకు పెద్దపీట వేస్తున్నట్లుగా కనిపిస్తుంది. అసలు వివాహాలు అనేది మనిషి పుట్టినప్పటినుండి ఉన్నాయా? అంటే కచ్చితంగా లేవనే మనం చెప్పవచ్చు.

అసలు వివాహ వ్యవస్థ అనేది ఎలా వచ్చింది? పెళ్లి అనే తంతుకు రూపకల్పన చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? దీని పూర్వాపరాలలోకి వెళ్లి చూస్తే సంఘంలో ఉంటే కొన్ని కట్టుబాట్లను.. అందులో ముఖ్యంగా మనిషి.. మగవాడు ఆడవాళ్లమీద ఆధిపత్యం చెలాయించడం.. ఒక స్త్రీకోసం పురుషులు పోటీపడి మారణకాండకు దిగడం.. ఇతరత్రా అనేక రకాలైన కారణాల దృష్ట్యా ఒక సాంఘికమైన భద్రత- అదే సమయంలో స్త్రీకి సంబంధించి ఒక భద్రత అనేవి రెండూ కల్పించాలి అనే ఉద్దేశ్యంతోనే వివాహ వ్యవస్థ వచ్చింది అని చెప్పాలి.

వివాహ వ్యవస్థకు రెండు ప్రయోజనాలు ఉంటాయి. వీటిలో ముఖ్యంగా సంతానోత్పత్తి, లైంగికపరమైన శృంగారేచ్ఛను నెరవేర్చుకోవడం. ఈ రెండు ప్రయోజనాలు కూడా ఒక రకంగా స్త్రీకి భద్రత కల్పించడం అనే ఉద్దేశ్యంతో మొదలుపెట్టిన ఈ వివాహ వ్యవస్థ కాలక్రమంలో స్త్రీకి సంకెళ్లరూపంలోకి మారినట్టుగా మనం చెప్పవచ్చు.

బలమైన మగవాళ్లు స్త్రీని విస్తృతమైన, విశృంఖలమైన లైంగిక దోపిడీ చేయకుండా వారి దోపిడీనుండి స్త్రీని రక్షించడానికి ఈ వివాహ వ్యవస్థకు రూపకల్పన చేశారు. అయినప్పటికీ కాలక్రమంలో కొందరికి ఒక పరిమితమైన వస్తువు రూపంలో స్త్రీని మార్చేసి, అసలు స్త్రీ స్వేచ్ఛకే వివాహ వ్యవస్థ ఒక బందిఖానాగా మారినటువంటి నేటి వివాహ వ్యవస్థలో మనకు కనిపిస్తోంది. ఇప్పుడు మనం తాజాగా చూస్తే చట్టపరమైన వివాహ వ్యవస్థలో వచ్చిన ఒక సదుపాయం లేదా సౌకర్యం ఏమిటంటే చట్టపరమైన ఒక బంధం ద్వారా స్త్రీ పురుషులు ఇరువురుకూడా ఇతరులనుండి రక్షింపబడడం, లైంగికపరమైన స్వేచ్ఛను అనుభవించడం  ఈ రెండూకూడా వివాహ బంధం ద్వారా లభించాయి అని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు వ్యక్తిస్వేచ్ఛకే చట్టాలు, న్యాయస్థానాలు పెద్దపీట వేస్తున్నటువంటి నేపధ్యంలో దీన్ని మరోసారి పునర్నిర్వచించుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది.

అయితే ఇది ఏరకంగా రూపుదిద్దుకుంటోంది అనే విషయానికి సంబంధించిన పరిణామాన్ని గురించి మనం వేచి చూడాల్సి ఉంది. సంఘంలో ఆరోజు అంటే కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం వివాహ వ్యవస్థను రూపొందించిన పరిస్థితులు, ఇప్పుడున్న సంఘంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకుంటే రాబోవుకాలంలో వివాహ వ్యవస్థకు కాలం చెల్లిపోయిందా? అనే ప్రశ్న తలెత్తుతుంది.

ఎందుకంటే ఈ వివాహ వ్యవస్థ ద్వారా స్త్రీని లేదా పురుషుడిని కలిపి ఉంచే క్రమంలో తాజాగా జరుగుతున్న అంశాలను చూస్తే, ఒక స్త్రీని వివాహ వ్యవస్థలో ఉన్నప్పటికీ కూడా వ్యక్తిస్వేచ్ఛను కాదని లైంగికంగా ఆమెను అనుభవించేందుకు భర్తకు కూడా అధికారం ఉండదు అనేది సుస్పష్టం. ఇది చట్టపరంగా తేలిన విషయం. మరోవైపు స్త్రీ భద్రత అనే ఒక వలయంలో తన ఆర్ధిక స్వేచ్ఛను, వ్యక్తి స్వేచ్చను కూడా వివాహ వ్యవస్థలో కోల్పోతోంది అని చెప్పవచ్చు. అందుకే మనం పాశ్చాత్య దేశాలలో ఈ వ్యవస్థకు సంబంధించిన అంశాలను అధ్యయనం చేస్తే ఒక్కో వ్యక్తి అది స్త్రీ అయినా పురుషుడైనా ఒక్కొక్కరు నాలుగైదు వివాహాలు చేసుకోవడం మనకు కనిపిస్తుంది.

భారతదేశంలో సంప్రదాయబద్ధమైన విధానాలు ఉన్నాయనే మనం చెబుతున్నప్పటికీ ఇప్పుడు అంటే మనకు స్వాతంత్ర్యం వచ్చిన ఈ 75 సంవత్సరాల కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే భారతదేశంలో కూడా అత్యంత వేగవంతంగా సాంఘికపరమైన అంశాలలో పరిణామాలు వస్తున్నాయి. విజ్ఞానశాస్త్రంలో కనిపించినంత వేగంగా సాంఘికపరమైన మార్పులు కనిపించవు. కానీ నాగరిక జీవన పరిణామంలో మార్పులు వచ్చినపుడు ఈ వివాహ వ్యవస్థ, దాని జీవన విధానంలో మార్పులు వచ్చేందుకు కచ్చితంగా దోహదం చేస్తాయి.

1940 కాలంలో కేవలం పది నుండి పదిహేను శాతం మాత్రమే పట్టణాలు, నగర జీవనాలు ఉన్నటువంటి నేపధ్యం అప్పటి భారతదేశంలో ఉండేది. కానీ ఇప్పడు అది దాదాపుగా 40 శాతం వరకు కూడా ఉంటున్నాయి. అంటే జీవన విధాన పరిణామ క్రమంలో మార్పు చోటుచేసుకుంటోంది. అంటే స్త్రీ తన జీవన విధానంలో ఉద్యోగ, ఉపాధిని వెదుక్కునే పరిస్థితి అప్పటితో పోల్చుకుంటే మూడు నుండి నాలుగు రెట్లు పెరిగినట్టుగా మనకు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

పల్లెటూళ్లు, గ్రామాలలో ఉండే కట్టుబాట్లన్నీ కూడా వ్యక్తి స్వేచ్ఛకు అనుసంధానం చేస్తూ దానిని రూపుదిద్దుతుంటాయి. అయితే పట్టణీకరణ వల్ల నగరాల్లో ఆ పరిధులను మించిన స్వేచ్ఛ నగరాల్లో లభిస్తుంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి 40 శాతం వరకు పట్టణీకరణ అనేది రానున్న మూడు నాలుగు దశాబ్దాలలో 60 శాతం వరకు చేరుకుంటుంది.

ఆ క్రమంలోనే వివాహ వ్యవస్థలో కూడా మార్పులొచ్చాయి. ప్రస్తుత కాలంలో మనం పెద్ద పెద్ద కాస్మోపాలిటన్ నగరాల్లో పరిశీలిస్తే, ‘కలిసి ఉండడం’ అంటే ఒకరిమీద ఒకరికి ఏరకమైన అధికారాలు లేకుండా కలిసి జీవించడం అనే విధానం అమలులోకి వచ్చింది. దాన్ని చట్టం, న్యాయస్థానాలు కూడా గుర్తిస్తున్నాయి. ఈ క్రమంలో చూస్తే రానున్న భవిష్యత్ కాలంలో స్త్రీకి, పురుషుడికి కూడా ఆర్ధికపరమైన స్వేచ్ఛ లభిస్తుంది. అంతేకాదు లైంగిక పరమైన స్వేచ్ఛ విషయంలో కూడా కొన్ని నియంత్రణలతో కూడినటువంటి అధికారాలు కూడా ఉండకుండా స్వేచ్ఛాయుతమైన జీవన విధానానికే అంటే లివింగ్ టుగెదర్ అనేటటువంటిదాన్ని ఒక మార్గంగా మనం చూడాల్సి వస్తుంది.

రానున్న కాలంలో సమాజ ప్రస్థానం ఆ దిశగానే సాగుతుందా? అంటే ఆ దిశగా కొన్ని అడుగులు పడుతున్నాయనే చెప్పాలి. ప్రస్తుత కాలంలో లివింగ్ టుగెదర్ అనే అంశాన్ని ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదు. గ్రామీణ ప్రాంతాలు, అంతకన్నా కాస్త పెద్దగా కనిపించే నగర పంచాయితీ పరిధిలో మనకు ఈరకమైన ధోరణి కనినించకపోవచ్చు. కానీ పెద్ద పెద్ద పట్టణాలు, నగరాల్లో ఇప్పుడిప్పుడే వ్యాపిస్తున్న ఈ సంస్కృతి రానున్న కాలంలో మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే కొన్ని వేల శతాబ్దాల కాలం నుండి మన దేశంలో వస్తోన్న వివాహ వ్యవస్థకు రానున్న కాలంలో ఎక్కడ ప్రమాదం పొంచి ఉంది?

ఈ వ్యవస్థలో ఉన్న లోపాలా? లేదా వాటివల్ల లభించే ప్రయోజనాలా? అనే కోణంలో ఆలోచిస్తే.. కచ్చితంగా వివాహ వ్యవస్థ కల్పించిన భద్రత అనేది ప్రమాదంలో పడిందనే చెప్పవచ్చు. ఎందుకంటే మనిషి ఆలోచనా తీరు, అతని నాగరిక జీవన విధానం మారుతూ వస్తోంది. ఇందులో స్వేచ్ఛ అనేదానికి పరిధి పెరుగుతోంది. నిర్వచనం మారుతోంది.

గతంలో లాగా కాకుండా ప్రస్తుత కాలంలో వివాహం అనేది వ్యక్తికి ఆర్ధిక పరమైన, సామాజిక పరమైన భద్రతను  అధిగమించి ఎవరికి వారు వ్యక్తిగతంగా సాంఘికంగా, ఆర్ధికంగా స్వేచ్చను పొందే అవకాశం, వెసులుబాటు ఏర్పడింది కనుక సంఘంలో ఒక కట్టుబాటుగా మారిన వివాహ వ్యవస్థకు కాలం చెల్లిందనే మనం చెప్పవచ్చు. రానున్న తరాలు ఈ వివాహ వ్యవస్థను ఒక భారంగా భావించే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా వివాహ వ్యవస్థలో రెండు రకాలైన ధోరణులు మనకు కనిపిస్తాయి. అందులో ఒకటి సర్దుబాటు ధోరణికాగా, రెండవది రాజీ. సర్దుబాటు అనేది సంఘజీవనంలో ఒకభాగం. ఇది కేవలం వివాహ బంధంలోనే కాకుండా మన ఇరుగు పొరుగు వారితో కూడా ఈ సర్దుబాటు ధోరణి అనేది చాలా అవసరం. ఇక రెండవది రాజీ.

వివాహ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రధానమైన లోపం రాజీ పడడం.  అంటే ఆర్ధికంగా, శారీరకంగా బలమైన వ్యక్తి ఆధిపత్యాన్నిసాధించడం ద్వారా, మరోవైపు స్త్రీ లేదా పురుషుడిపైన రెండో వ్యక్తి తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించే అవకాశం ఉంది. అంటే వైవాహిక వ్యవస్థ అనేది సర్దుబాటు ధోరుణిని దాటి రాజీ వ్యవస్థకు చేరింది. అందులో  స్త్రీలు ఎక్కువగా ఈ వ్యవస్థలో రాజీ పడే విధంగా కనిపిస్తోంది. ఇది నేటి వివాహ వ్యవస్థలో కనిపించే ప్రధాన లోపంగా ఉంటోంది.

అందుకే నేటి సమాజంలో చట్టపరంగా లభిస్తున్న ఆర్ధికపరమైన, వ్యక్తిగతపరమైన స్వేచ్ఛలు భవిష్యత్తులో కచ్చితంగా వివాహ వ్యవస్థలో బలమైన మార్పులను, కుదుపులను తీసుకువస్తాయని మనం అంచనా వేయవచ్చు. ఈ మార్పులు, కుదుపుల వల్ల రానున్న కాలంలో సంతానోత్సత్తి అనేది ఒడిదుడుకులను గురయ్యే అవకాశం ఉంది. దీనికి పరిష్కారం ఏమిటి? అంటే ఇద్దరూ సమాన బాధ్యత వహించే అవకాశం ఉంటుందా? మరోవైపు పాశ్చాత్య దేశాలలో స్త్రీ పురుషులకు సంబంధించిన సంతానోత్సత్తి దానికి సంబంధించిన ఏర్పాట్లు ఏమిటి అనే విషయంపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.

అటు భర్తగానీ, లేదా భార్యగానీ.. అంటే వివాహ సంబంధం లేకుండా వచ్చిన మగవాడుగానీ, లేదా స్త్రీగానీ వాళ్లిద్దరూ కూడా పిల్లలకు సంబంధించిన విషయంలో ఒక ఒప్పందానికి వస్తూ అంటే పరస్పర అంగీకారయోగ్యమైన ధోరణిలో ముందుకు వెళుతున్నట్టుగా మనకు తెలుస్తోంది. ఇదే పరిస్థితులు రానున్న కాలంలో భారత దేశంలో కూడా కనిపించవచ్చు. వివాహ వ్యవస్థ వల్ల ఎంత ప్రయోజనం ఉంది? లేదంటే దానివల్ల జరుగుతున్న జరుగుతున్న నష్టం ఎంత?

వివాహ వ్యవస్థ వ్యక్తి స్వేచ్ఛకు ప్రయోజనదాయకంగా ఉందా? లేదంటే వ్యక్తి స్వేచ్ఛకు అడ్డంకిగా ఉంటూ వ్యక్తిని బందీగా మారుస్తోందా? ఈ రెండింటికీ మధ్య జరిగే పరస్పర ఘర్షణలో వ్యక్తిస్వేచ్ఛకే పెద్దపీట వేయాల్సిన పరిస్థితి వచ్చినపుడు ఈ వివాహ వ్యవస్థ అనేది కాలం చెల్లినటువంటి ఒక కట్టుబాటుగా మారే అవకాశం ఉంది. ఆ దిశలోనే నేటితరం ఆలోచనలు సాగిస్తోంది అని మనం చెప్పవచ్చు.

..కృష్ణసాయిరాం
సీనియర్ పాత్రికేయుడు

Tags: britain court verdict on dubai kingcouple for divorcedubai king maqtumdubai king shockedfrustrated couplehaya gets 5500 cr compensation from husbandkrishna sairamkrishnasairamక్రిష్ణసాయిరాంక్రిష్ణసాయిరాం విశ్లేషణ
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

20.9.26 కథానిధి సమీక్ష: సామాజిక వాస్తవికతకు సజీవ దర్పణాలు

27.9.26 కథానిధి సమీక్ష: కలల శిథిలాల మీద చిగురించిన ఆశల వృక్షం

13.9.26 కథానిధి సమీక్ష: మానవ సంబంధాలు అక్షరబద్ధం

4.10.26 కథానిధి సమీక్ష: కాలపు కదలికలకు అక్షర దర్పణాలు

‘యుద్ధాలు బలికోరేది మానవత్వాన్నేనా?’

23 ఆగస్టు 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply