మెగాస్టార్ చిరంజీవికి కొవిడ్ పాజిటివ్ నిర్ధరణ అయింది. చాలాకాలం తర్వాత.. బయటకు వచ్చి.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను చిరు కలిసారు. ఆరోజు భేటీలో చిరంజీవి తోపాటు నాగార్జున కూడా ఉన్నారు. చిరంజీవికి పాజిటివ్ అని తెలియగానే భేటీలో ఉన్నవారంతా కరోనా పరీక్షలు చేయించుకున్నారు. వారిలో కొందరు ప్రముఖులకు పాజిటివ్ అని తేలినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో.. చిరంజీవి కరోనా అంటించి ఉంటారనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఇంకో వాదన కూడా వినిపిస్తోంది. ఇంతకూ చిరంజీవి కరోనా అంటించారా? ప్రగతి భవన్‌కు వెళ్లి తాను అంటించుకున్నారా? అనేది చర్చ.
మెగాస్టార్ చిరంజీవి తొలినుంచి కూడా కొవిడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నారు. చిరంజీవి వయస్సు ప్రస్తుతం 65 ఏళ్లు. కొవిడ్ తొలిరోజుల నుంచి ఆయన చాలా జాగ్రత్తలు పాటిస్తున్నారు. మామూలుగానే.. చిరంజీవి శానిటైజేషన్ విషయంలో అప్రమత్తంగానే ఉంటారు. రాజకీయ పార్టీ స్థాపించినప్పుడే.. ప్రత్యేకవాహనంలో రాష్ట్రమంతా పర్యటించిన చిరంజీవి.. ఆయా సందర్భాల్లో ప్రజలను కలిసి తిరిగి వాహనంలోకి వచ్చిన వెంటనే హాండ్ శానిటైజర్ వాడేవారు. అలా కొన్ని సంవత్సరాల ముందునుంచి కొత్త వారిని కలిసినప్పుడు.. శానిటైజ్ చేసుకునే అలవాటు ఆయనకు ఉంది.
Read these stories మా కన్నీళ్లు ఆల్రెడీ ఎండిపోయాయి సారూ.. దీపావళి సెలబ్రేషన్ ముందు కాస్త ఆలోచించండి యూజ్ అండ్ త్రో కప్పులు నాట్ సేఫ్! ఈసారికి పుష్కర పుణ్యం వదిలేసుకోండి ప్లీజ్!!
అలాంటి చిరంజీవి కొవిడ్ వచ్చాక ప్రజలందరికీ కూడా చేతులు కడుక్కోవడం గురించి శానిటైజేషన్ మాస్క్ ధరించడం గురించి అనేక వీడియోల ద్వారా సలహాలు చెప్పారు. అయితే ఇన్నిరోజులుగా ఆయన ఇంటికే పరిమితమైపోయి ఉన్నారు. నాగబాబు కూతురి నిశ్చితార్థం, నాగబాబు పుట్టినరోజు, పవన్ కల్యాణ్ పుట్టినరోజు లాంటి కార్యక్రమాలు ఈ వ్యవధిలో వచ్చినప్పటికీ ఆయన చాలా పరిమితంగా మాత్రమే పాల్గొన్నారు. జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే.. వరదబాధితులకు ప్రకటించిన సాయం అందించడానికి సీఎం ప్రగతిభవన్‌కు వెళ్లిన తర్వాత మాత్రమే ఆయనకు కొవిడ్ పాజిటివ్ బయటపడింది.
చిరంజీవికి ఇతరత్రా కొవిడ్ వచ్చే అవకాశమే లేదని.. నిత్యం ఎంతో మంది వస్తూ పోతూ ఉండే ప్రగతి భవన్‌కు వెళ్లడం వల్లనే ఆయనకు కూడా సోకిందని సినీ వర్గాల్లో ఒక వాదన వినిపిస్తోంది. ప్రగతి భవన్ కు చిరంజీవి వెళ్లగానే అక్కడి సిబ్బంది కొందరు చిరుతో కలిసి ఫోటోలు దిగడానికి ఉత్సాహపడ్డారని, అలాంటి వారి ద్వారా అక్కడే చిరంజీవికి సోకి ఉంటుందని అంటున్నారు.
చిరంజీవికి మొదట పాజిటివ్ గా తేలింది. దాంతో ఆరోజు భేటీలో ప్రగతి భవన్ లో ఉన్న వారంతా కొవిడ్ టెస్టులు చేయించుకున్నారు. వారిలో కొందరు ప్రముఖులకు పాజిటివ్ తేలినట్లు తెలుస్తోంది. అయితే అది చిరంజీవి ద్వారా వారికి సోకడం కాదని, వారిద్వారానే చిరంజీవికి సోకి ఉంటుందని వ్యాఖ్యానిస్తున్నారు. నిజం ఏమిటో గానీ.. చిరంజీవికి కొవిడ్ సోకడం అనేది ప్రజలందరూ కూడా మరింత అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకతను తెలియజెబుతోందని అందరూ అంగీకరించాల్సిందే.
.

Discussion about this post