శ్రీకాళహస్తి పట్టణం, స్వర్ణముఖి నది ఒడ్డున జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల పక్కన నూతన గ్రంథాలయ భవనానికి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి భూమి పూజ చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంధాలయ చైర్మన్ మధుబాల, దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, 30 ఏళ్లుగా అద్దె భవనంలోనే ఉంటున్న గ్రంథాలయానికి గత ప్రభుత్వంలోని ఏనాయకులు పట్టించుకోలేదనిమ అన్నారు. పేద విద్యార్థులకు దశ దిశ నిర్దేశించి గ్రంథాలయానికి శాశ్వత భవనం ఉండడం ఎంతో ఆవశ్యకతని భావించి గ్రంథాలయ నిర్మాణ ప్రతిపాదనను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకునివెళ్లడంతో, వెంటనే జగనన్న స్పందించి 1కోటి 20 లక్షల రూపాయల వ్యయంతో శాశ్వత భవన నిర్మాణాన్ని ఏర్పాటు చేశామన్నారు.
పేదవిద్యార్థులు ఈ గ్రంథాలయంలో చదివి వారి భవిష్యత్తును తీర్చి దిద్దుకుంటారని, శ్రీకాళహస్తి చరిత్రను భావితరాలకు చెప్పే విధంగా ఈ గ్రంథాలయం నందు శ్రీకాళహస్తికి చెందిన పురాతన పుస్తకాలను ఉంచే విధంగా ఏర్పాటు చేస్తామని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో గుమ్మడి బాలకృష్ణ, పగడాల రాజు, వయ్యాల కృష్ణారెడ్డి, శెట్టిపల్లి సురేష్, వడ్లతంగాల్ బాలాజీ రెడ్డి, నాని, రాఘవరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, చిట్టి వేలు జయగోపాల్, అర్కొడు శంకర్, బుజ్జి మెస్త్రి, నందా, మధు రెడ్డి, సెన్నిరు కుప్పం శేఖర్, దాము, పురుషోత్తం గౌడ్, గోరా, ఫజల్, కంట ఉదయ్ కుమార్, పూల కృష్ణమూర్తి, స్వర్ణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

.