ఇప్పుడు చెప్పండి
ఇంకా
ఖండాంతరాల కలలే కందామా
వీసా కోసం ఎదురు చూద్దామా
డాలర్ల గురించే మాట్లాడుకుందామా
రంగుల వారీగా ముఠాలు కడదామా
బలగాలతో చంకలు గుద్దుకుందామా
స్వర్గాల గురించే చర్చలు జరుపుదామా
తోకల్నే మెళ్లో వేసుకు తిరుగుదామా
రెండు చేతులూ తెగనరుక్కొని
ఆరో వేలు మాత్రమే అందిద్దామా
సేవల్ని బీరువాల్లో భద్రపరచి
పెదవుల్ని అంగట్లో ప్రదర్శన కుంచుదామా
రక్తమాంసాలను రహస్య తిత్తులలో దాపెట్టి
ఉండుకాలకు ఊరేగింపులు చేద్దామా
కుంటిసాకుల కుర్చీలనే నమ్ముకుందామా
హామీలతోనే కడుపు నింపుకొందామా
ఉచిత వేలంపాటల్లో నాట్యం చేద్దామా
సేకరణలోనే పొలాలకు నీళ్లొదిలేద్దామా
క్రిమికీటకాలన్నిటినీ జీర్ణం చేసుకుందామా
సారమంతా రసాయనాలకే అంకితమిద్దామా
తస్సా దియ్యా…
వెయ్యిన్నొక్క రకాల వైక్తిక భరోసాలను
ఒక్క వైరస్ తునాతునకలు చేసింది కదా!
ఇప్పుడు చెప్పండి-
… ఎమ్వీ రామిరెడ్డి
9866777870
కరోనా మహమ్మారి వల్ల దేశానికి జరిగిన మేలేంటి
Discussion about this post