తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకుష్ కు బుధవారం ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డివారి గురవారెడ్డి ముక్కంటి ప్రసాదాలు అందజేశారు.
ఉండవల్లి లోని నారా లోకేష్ స్వగృహంలో కలసి ముక్కంటి శేషవస్త్రంతో సన్మానించారు.
ఈ సందర్భంగా నారా లోకేష్ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా గురవారెడ్డి మాట్లాడుతూ.. రాబోయే సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తేవడమే తమ లక్ష్యమన్నారు.
ఇందుకోసం శక్తివంచన లేకుండా పని చేస్తామని హామీ ఇచ్చారు.
.