కొన్ని సవాళ్లుంటాయి.. అవి విసరబడడమే తప్ప జీవితంలో ఎన్నటికీ వాటిని ఎవ్వరూ పట్టించుకోరు. నిజానికి సదరు సవాళ్లు విసిరిన వారు కూడా కొన్నాళ్ల తర్వాత వాటిని మర్చిపోతారు. ఏదో జనం కనిపించే సరికి.. ఆవేశంలో కాస్త రక్తి కట్టించడానికి అన్నట్టుగా ఒక సవాలు విసిరేసి.. ఆ తర్వాత.. నేను సవాలు విసిరాను గానీ.. అవతలి వాళ్లు భయపడిపోయారు.. అని చెప్పుకుంటూ గడిపేస్తారు. ఇప్పుడు లోకేష్ కూడా అదే పని చేస్తున్నారు.
తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక ప్రచారాన్ని సూళ్లూరుపేటనుంచి ప్రారంభించగానే.. లోకేష్ జగన్ మీద డైరక్ట్ ఎటాక్ కు దిగారు. సీఎం జగన్‌కి నారా లోకేశ్ సవాల్ చేశారు. ‘నేను గాని, నా కుటుంబ సభ్యులు గాని మీ బాబాయ్‌ని చంపలేదని నేను ప్రమాణం చేస్తా – నువ్వు గాని, నీ కుటుంబ సభ్యులు గాని మీ బాబాయ్‌ని చంపలేదని ఈ నెల 14న వెంకన్న సాక్షిగా ప్రమాణం చేయగలవా?’ అనేది టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి. నారా లోకేశ్ సవాలు.
అర్థం పర్థం లేని సవాలు ఇది. చూడబోతే.. ‘వైఎస్ వివేకానందరెడ్డి హత్య’ అనే ఒకే ఒక్క అంశాన్ని పట్టుకుని.. తిరుపతి ఉప ఎన్నికలో నెగ్గిపోవాలని అటు బీజేపీ- జనసేన, ఇటు తెలుగుదేశం ఆశపడుతున్నట్లుగా ఉంది. మొన్న పవన్ కల్యాణ్ తిరుపతి వెళ్లి అంత పెద్ద బహిరంగ సభ పెడితే.. హైలైట్ అయినది అదొక్క పాయింటే. ఇవాళ లోకేష్ ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తే.. ఆ పాయింటు మీదనే మాట్లాడుతున్నారు. దానిద్వారా వారు ఏం సాధిస్తారో తెలియడం లేదు.
ప్రభుత్వం లోపాలు వారికి కనిపించని పరిస్థితుల్లో మాత్రమే.. ఇలాంటి పసలేని అంశాలకు విలువ ఇచ్చి ప్రధానంగా వాటి గురించి మాటాడుతున్నారేమో అనే అభిప్రాయం కలుగుతోంది.
.

Discussion about this post